Meritorious award to telangana government

Meritorious Award, Telangana government, check, bogus cards, e-pds system

Meritorious Award to Telangana government, as it puts check to bogus cards through e-pds system

తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిభా పురస్కారం

Posted: 09/21/2014 12:41 PM IST
Meritorious award to telangana government

నాలుగు మాసాల్లోనే బొగస్ కార్డుల ఏరివేతకు చెక్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ప్రతిభా(మెరిట్) అవార్డును అందజేసింది. శాస్త్ర, సాంకేతికతను వినియోగించుకుని అనూహ్య ఫలితాలను సాధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఈ పురస్కారాన్ని అందజేసింది. 'కనిష్ఠ ప్రభుత్వం.. గరిష్ఠ పాలన' పేరుతో సాంకేతికతను వినియోగించుకున్న విభాగాలను గుర్తించేందుకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు నాలుగు రోజుల పాటు మేధోమథనం చేశాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ రూపొందించిన ఈ-పీడీఎస్ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగించుకుంది.

అధార్ కార్డుల సీడింగ్‌ను చేపట్టడంతో లక్షల సంఖ్యలో బోగస్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. మూడు నెలల వ్యవధిలో 10.13 లక్షల కార్డులను రద్దు చేసింది. దీంతో 16.54 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆదా చేసింది. మూడు నెలల కిందట 63 శాతం ఉన్న ఆధార్‌ కార్డుల సీడింగ్ ప్రస్తుతానికి 89 శాతానికి చేరుకుంది. ఈ-పీడీఎస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి అనూహ్య ఫలితాన్ని సాధించినందుకు కేంద్రం 'ఆర్డర్ ఆఫ్ మెరిట్' పేరుతో అవార్డును ఇచ్చింది. కేంద్ర పంచాయతీరాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖల మేధోమథనం సందర్భంగా తెలంగాణ సర్కారు ఈ అవార్డును అందజేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meritorious Award  Telangana government  check  bogus cards  e-pds system  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more