Congress suffered defeat due to the ineffectiveness leadership of ponnala

Congress, suffered, defeat, Ineffectiveness, leadership, Ponnala lakshmaiah, telangana people, belive, balaram nayak

Congress suffered defeat, due to the Ineffectiveness leadership of Ponnala, people of telangana din't belive him

పొన్నాలను తెలంగాణ ప్రజలు విశ్వసించలేదు..

Posted: 09/21/2014 11:54 AM IST
Congress suffered defeat due to the ineffectiveness leadership of ponnala

సార్వత్రిక ఎన్నికలు జరిగి నాలుగు మాసాలు కావస్తున్నా.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై సొంతగూటికి చెందిన నేతలే కస్సుమంటున్నారు. ఆయన అసమర్థపు నాయకత్వం వల్లే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందిందంటున్నారు. ఎన్నో త్యాగాలకు ఓర్చి తెలంగాణ తెచ్చిన, ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించకపోడానికి కారణం పోన్నాలేనని ని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ ఆరోపించారు. పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన నాటి నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగడం ప్రారంభమైందన్నారు. పొన్నాల వల్లే కాంగ్రెస్ ఓటమి పాలైందన్న విషయాన్ని తాను ఎక్కడైనా ధైర్యంగా చెబుతానన్నారు. పొన్నాల మినహా ఎవరు ఆ పదవిలో ఉన్నా... ఫలితాలు ఆశాజనకంగా ఉండేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య ముఖ్యమంత్రుల అడుగులకు మగుడులోత్తిన పోన్నాలను ప్రజలు విశ్వసించలేదని.. అందకనే కాంగ్రెస్ కు ఓటు వేయలేదని విమర్శించారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగనప్పుడు... రెడ్యానాయక్ ప్రాతినిథ్యం వహిస్తున్న డోర్నకల్‌లో అభివృద్ది ఎలా జరుగుతుందన్నారు. రేట్లు పెంచే ఫైళ్ల మీద మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం పనులతో ఆయన కుటుంబానికే లబ్ధి జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు ముఖ్యమంత్రి గానీ... ఉప ముఖ్యమంత్రి గానీ అయ్యే అవకాశముండేదన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా రెడ్యాకు డోర్నకల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా ఉందన్నారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీపీ మేకపోతుల రమ్య, జెడ్పీటీసీ సభ్యురాలు కేశబోయిన స్వరూప పాల్గొన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more