Supreme courts rejects ap s eamcet second phase counselling plea

andhrapradesh higher educational council, telangana higher education council, eamcet counselling, eamcet second phase counselling 2014, latest news, supreme court, engeneering colleges, andhrapradesh, telangana

supreme court rejects andhrapradesh higher education council's plea to permit second phase counselling : its too delayed in first phase counselling and no chance for second phase counselling says supreme court to ap higher education council

ఎంసెట్ రెండోదశ కౌన్సిలింగ్ లేదన్న సుప్రీం

Posted: 09/11/2014 01:37 PM IST
Supreme courts rejects ap s eamcet second phase counselling plea

సుప్రీంకోర్టులో ఏపీ ఉన్నత విద్యామండలికి భంగపాటు ఎదురయింది. రెండవ విడత కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలన్న మండలి పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. పిటిషన్ పై విచారణ సందర్బంగా తొలి విడతలో 65వేలకు పైగా సీట్లు మిగిలిపోయినందున సెకండ్ ఫేజ్ కు అనుమతివ్వాలని మండలి కోరింది. అయితే ఈ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. తొలివిడత కౌన్సిలింగ్ ఆలస్యంగా నిర్వహించిన ఉన్నత విద్యామండలికి మరోసారి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని జ్టసిస్ ముఖోపాధ్యాయ తెలిపారు.

తొలి విడత కౌన్సిలింగ్ గడువు పొడగింపుపై తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్ నే కొనసాగించాలని స్పష్టం చేసింది. అంటే ఇక ఈ ఏడాదికి ఏపీలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం లేనట్లే. తొలి విడతగా కౌన్సిలింగ్ కు ఏపీ ఉన్నత విద్యామండలి సిద్ధమవగా తెలంగాణ ప్రభుత్వం మొదట్లో సహకరించలేదు. తమ కౌన్సిలింగ్ సొంతంగా నిర్వహించుకుంటామని చెప్పింది. దీనిపై కొద్ది వివాదం తర్వాత రెండు రాష్ర్టాలు కలసి కౌన్సిలింగ్ నిర్వహించాయి. ఫలితంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. అయితే ఈ ఆలస్యంపై సుప్రీంకోర్టుకు ఉన్నత విద్యామండలి సమాచారం ఇవ్వలేదు.

65వేలకు పైగా సీట్లు ఖాళీగా ఉండటంతో కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. రెండవ విడతలో కాస్తయినా సీట్ల భర్తీ జరుగుతుందని ఆశించిన వారు సుప్రీం తీర్పుతో నిరాశ చెందుతున్నారు. సగం సీట్లు భర్తీ అయి.., కొన్నిచోట్ల అసలే సీట్లు భర్తీకాకుండా కాలేజీలు నడపలేమని మేనేజ్ మెంట్ చెప్తోంది. కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తే.., లేక కాలేజి యాజమాన్యాలు, ప్రభుత్వం మరొక పిటిషన్ వేస్తే వచ్చే తీర్పుపై తదుపరి నిర్ణయం అమలవుతుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme courts  eamcet counselling  higher education council  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more