Today last day for medak bypoll campaign

telangana, telangana government, kcr, medak bypoll, by elections, bypolls, latest news, jagga reddy, sunita laxmareddy, saturday, election commission, ec, ceo, hyderabad, trs, congress, bjp, revanth reddy, k prabakar reddy

medak bypoll campaign came to ending stage as today is the last day : medak byelection campaign will conclude at evening 5o clock last day all parties trying to cover majority places and people

ఇవాళే చివరి తేది

Posted: 09/11/2014 10:42 AM IST
Today last day for medak bypoll campaign

మెదక్ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. ఈ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సెప్టెంబర్ 13న జరిగే మెదక్ ఎంపీ స్థానం ఉప ఎన్నికకు గురువారం సాయంత్రం 5గంటలతో ప్రచార గడువు ముగుస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. గడువు దగ్గర పడటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. అధికారులు ఎంత నిఘా పెట్టినా ఈ దఫా ఉప ఎన్నికలో కూడా డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలు ఓటర్లకు ఆశ చూపుతూనే ఉన్నాయి. వీటిపై పలు కేసులు నమోదు చేసినట్లు పోలిసులు తెలిపారు.

ఇక చివరి రోజు ప్రచారంలో బీజేపి అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ జరిగే ప్రచార కార్యక్రమాల్లో బీజేపి అభ్యర్ది జగ్గారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు కేంద్రమంత్రులు వస్తున్నారు. ప్రకాష్ జవదేకర్, పియూష్ గోయల్, సదానందగౌడలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. వీరిలో ప్రకాష్ జవదేకర్ కు తెలంగాణతో పాత పరిచయం ఉంది. ఉద్యమం సమయంలో కూడా  పలుమార్లు హైదరాబాద్, ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో స్వయంగా పాల్గొని తెలంగాణ కోసం నినదించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ ఎంపీ స్థానంకు జరిగే ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. తొలి ఎన్నికల్లో కారు జోరు కొనసాగితే అందుకు కళ్లెం వేయాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే పోటి మాత్రం టీఆర్ఎస్ బీజేపి మద్యే ఉంది. టీఆర్ఎస్ తరపున కె. ప్రభాకర్ రెడ్డి, బీజేపి నుంచి జగ్గారెడ్డి బరిలోకి దిగుతున్నారు. గులాబిదళం కంచుకోటలో వికసించాలని కమలం వర్గం ఉవ్విళ్లూరుతోంది. అటు పోటాపోటిగా ప్రచారం జరుగుతుండటంతో పాటు గెలుపు అవకాశాలు కూడా సమీకరణాలను బట్టి ఇద్దరి మద్య దోబూచులాడుతున్నాయి. దీంతో ఓటరు దేవుళ్లు ఎవరిని అందలమెక్కిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : medak bypoll  campaign  telangana  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more