Central government will take action on telangana msos

telangana, telangana government, kcr, mso, cable operators, tv9 telugu, tv9 ban, andhrajyothy, andhrajyothy ban, ban on media, telangana media ban, journalists, protest prakash javadekar, central government

central minister prakash javadekar says central government will take action on telangana cable operators : prakash javadekar serious on the issue of ban on tv9 and abn channels in telangana says soon msos will punished

తెలంగాణ ఎం.ఎస్.ఓ.లపై కేంద్రం చర్యలు

Posted: 09/11/2014 10:28 AM IST
Central government will take action on telangana msos

తెలంగాణలో ఏబీఎన్, టీవీ9 నిషేదం వివాదం ముదిరి పాకాన పడింది. చానెళ్లను ప్రసారం చేసేదే లేదని బీష్మించి కూర్చున్న ఎం.ఎస్.ఓ.లకు కేంద్రం షాకిచ్చింది. త్వరలోనే తెలంగాణలో ఛానెళ్లు నిషేదించిన కేబుల్ ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. మీడియాను రెండు నెలలకు పైగా నిషేధంలో పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పాలన, ఇదెక్కడి ప్రభుత్వ విధానమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ చానెళ్ళ ప్రసారాల నిలిపివేతపై రెండు చానెళ్ళ జర్నలిస్టులు ప్రకాష్ జవదేకర్ ను కలిశారు.

ప్రసారాల కోసం రెండు నెలలుగా తాము చేస్తున్న ధర్నాలు, నిరసనలు, విజ్ఞప్తులను వివరించారు. చానెళ్ళపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి విన్న కేంద్ర మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వమంటే ఇలాగేనా వ్యవహరించేదని అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే చానెళ్ళను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. అదేవిధంగా నిషేదాన్ని అమలు చేసిన తెలంగాణ ఎం.ఎస్.ఓ.లపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఛానెళ్ళ నిషేదంపై ఢిల్లీ పర్యటనలో తనను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను జవదేకర్ ఆరా తీశారు. అయితే తామెలాంటి ఆంక్షలు పెట్టలేదనీ.., ఎం.ఎస్.ఓ. వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నారు. దీంతో వారిపైనే చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రమంత్రి తాజా హెచ్చరికతో అయినా ఆపరేటర్లు దిగి వస్తారా.., లేక మొండిపట్టుతో మొదటికే మోసం వచ్చేలా వ్యవహరిస్తారా అనేది వేచి చూడాలి. అటు జర్నలిస్టులు, మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యల పై జాతీయ మీడియా కూడా దృష్టిపెట్టింది. తొక్కేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రధాన అంశాలుగా జాతీయ మీడియా ఛానెళ్లు ప్రసారం చేసి, చర్చలు నిర్వహిస్తున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prakash javadekar  telangana government  mso  tv9 abn  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more