Unknown person suicide in a home

unknown death, suicide, hanged, hyderabad, chadarghat, hyderabad police, hyderabad police vehicles, suspecious death, ajampura, latest news, telangana

unknown person suicided in a person named kaled home in ajampura area : chadarghat police enquring case about suspecious death in ajampura area

ఊరెళ్తే ఇంట్లో ఎవరో ఉరేసుకున్నారు

Posted: 09/05/2014 08:50 AM IST
Unknown person suicide in a home

హైదరాబాద్ పాతబస్తిలోని ఓ కుటుంబం షాక్ లో ఉంది. ఊరెళ్ళి వచ్చే సరికి ఇంట్లో శవం కన్పించటంతో హడలిపోయారు. ఇదెక్కడి దారుణమంటూ.., పోలిసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం చాదర్ ఘాట్ పోలిసులు ఈ కేసును ధర్యాప్తు చేస్తున్నారు. ఆజంపురాకు చెందిన ఖాలేద్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఖాలేద్ ఈ మద్య ఊరెళ్ళాడు. బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. చూసే సరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. దొంగతనం జరిగిందని భావించి అంతా ఆందోళన చెందారు.

బెడ్ రూం తలుపు తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన ఖాలేద్ బెడ్ రూం కిటికీ అద్దాలు పగులగొట్టాడు. చూసే సరికి ఓ వ్యక్తి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. ఇది చూసిన కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే పోలిసులకు కంప్లయింట్ ఇవ్వగా.., ఘటనాస్థలానికి చేరుకున్న వారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. స్థానికంగా విచారించినా వ్యక్తి గురించి ఎలాంటి ఆదారాలు లభించకపోవటంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఖాలేద్ ఇంట్లోకి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతికి గల కారణాలేమిటి అనే విషయంపై పోలిసులు ధర్యాప్తు చేస్తున్నారు.

ఊరెళ్లి వచ్చే సరికి ఇంట్లో మృతదేహం కన్పించటంతో అప్పటినుంచి ఖాలేద్ కుటుంబం షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. తమ ఇంట్లోకి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని వారు తల పట్టుకుంటున్నారు. మరోవైపు మిగతా ఇళ్లవారు కూడా తాళ: వేసి బయటకు వెళ్లాలంటే ఏమవుతుందో అని భయపడుతున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unknown death  suicide  hyderabad  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more