Stripped and blackmailed a student in visvabharati university

visva bharati university, ragging, stripping, blackmail, latest news, kolkata, west bengal, university, students, scandal, money

a student alleges that she was stripped and blackmailed for money : fiirt year student blackmailed by seniors by stripping and demanded four thousand rupees in visva bharati university

బట్టలు విప్పి బ్లాక్ మెయిల్ చేశారు

Posted: 08/30/2014 09:51 AM IST
Stripped and blackmailed a student in visvabharati university

ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిలు ఉన్న విశ్వభారతి యునివర్సిటీ ఓ అపఖ్యాతిని మూటగట్టుకుంది. విశ్వకవి రవీంధ్రుడు పుట్టిన గడ్డపై నెలకొన్న ఈ యునివర్సిటీపై మాయని మచ్చ పడింది. ఓ విద్యార్ధినిని సీనియర్లు బట్టలు విప్పించి.., డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమబెంగాల్ లోని శాంతి నికేతన్ లో విశ్వ భారతి యునివర్సిటీ ఉంది. ఇందులో చదువుతున్న ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని.., తనను సీనియర్లు బట్టలు విప్పించి ఫొటోలు తీశారని ఆరోపించింది. అంతేకాకుండా డబ్బులు ఇవ్వాలని లేకపోతే వాటిని ఇంటర్నెట్ లో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారని చెప్పింది.

తనకు జరిగిన అవమానంపై.., యునివర్సిటీ అధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తన బట్టలు విప్పి.. ఫొటోలు తీసి, రూ.4వేల డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపింది. మొత్తం ముగ్గురు సీనియర్లు తనను బ్లాక్ మెయిల్ చేశారని వెల్లడించింది. వీరిలో ఇద్దరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాగా.., మరొకరు థర్డ్ ఇయర్ స్టూడెంట్ అని చెప్పింది. ఆగస్టు 8న ఈ ఘటన జరిగితే.., ఆగస్టు 26న బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే తనతో అనుచితంగ ప్రవర్తించిన విద్యార్థులపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

అటు యునివర్సిటీ తన కూతురును అవమానించిందని బాదితురాలు తండ్రి ఆరోపించారు. దారుణానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోకుండా.., పోలిసులకు చెప్పవద్దని వర్సిటీ అధికారులు కోరారని విమర్శించారు. అంతేకాకుండా నిందితులను వదిలిపెట్టి.., తమ కూతురుకు కొత్త బట్టలు కొనివ్వాలని గొప్ప తీర్పు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను విశ్వభారతి యునివర్సిటి ఇంతలా అవమానిస్తుంది అనుకోలేదని తండ్రి, కూతురు అన్నారు. ఇంత అవమానం జరిగిన ఈ యునివర్సిటీలో ఇంక ఉండనని చెప్పి వెళ్ళి పోయింది, ఇప్పటివరకు తిరిగి రాలేదు. అటు ముగ్గరు విద్యార్థులపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా వారంతా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాగింగ్ చట్ట విరుద్ధం, నేరమని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయితే నిబంధనలను కఠినంగా అమలు చేసి అవగాహన కల్పిస్తే ఇలాంటి దారుణాలు జరగవు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ragging  visva bharati university  stripping  black mail  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more