‘‘ఫేస్ బుక్’’ ఖాతాలో ఇంతవరకు ఎన్ని రికార్డులు నమోదయ్యాయో అంచనా వేయలేరు! ఇది ఎప్పటి నుంచి అయితే వాడకంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి ఏదో ఒక సంచలనాన్ని సృష్టిస్తూనే వుంది. ప్రముఖ సెర్చ్ ఇంజన్లను సైతం పక్కననెట్టేసి.. తనదైన సత్తాతో ముందుకు దూసుకుపోతోంది. నేటి తరానికి చెందిన యువకులు అయితే దీనిని వదిలిపెట్టకుండా ఒక్క క్షణం కూడా వుండలేరు. మూడుపూట్ల భోజనం లేకపోయినా వుండగలుగుతారు కానీ.. ఫేస్ బుక్ లేకుండా మాత్రం వీరికి కనీసం నిద్ర కూడా రాదు. స్మార్ట్ ఫోన్లను వాడుతున్నది కూడా కేవలం ఈ ఫేస్ బుక్ కోసమే! ఎందుకంటే బరువుగా వుండే ల్యాప్ టాప్ లను, కంప్యూటర్లను చేతిలో పెట్టుకుని తిరగలేం కదా... దాంతో ఫేస్ బుక్ ను అనువుగా వుండే మొబైల్ ఫోన్లను కొనుక్కుని.. ప్రతిక్షణానికి దీన్ని ఫాలో అయిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. డ్రగ్స్ కంటే చాలా ఎక్కువగా యువకులు దీనికి అడిక్ట్ అయిపోయారని అనుకోవాల్సిందే!
సాధారణంగా ఫేస్ బుక్ కు రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. ప్రపంచంలోనే ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ అయిన ‘‘గూగుల్’’తో పోటీపడుతూ గ్లోబల్ ర్యాంకింగ్ లో రెండవ స్థానాన్నే ఆక్రమించేసుకుంది. దీని తర్వాత మిగతా యాప్స్ అన్నీ! దీనిని బట్టే అర్థమవుతోంది... ఫేస్ బుక్ తన వలలో ప్రపంచాన్ని వేసుకుందని! ఇదిలావుండగా.. తాజాగా ఇది మరో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈసారి ఇది గూగుల్ ను కూడా తలదన్నేసింది. అమెరికాలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అత్యధికంగా వాడుతున్న యాప్ గా ఫేస్ బుక్ నిలిచింది. 11 కోట్లమందికి పైగా వినియోగదారులు దీనిని వాడుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. దీని తర్వాత యూట్యూబ్, గూగుల్ ప్లే, గూగుల్ సర్చ్, పండోరా, గూగుల్ మ్యాప్స్, జీ మెయిల్, ఇన్ స్టా గ్రామ్, యాపిల్ మ్యాప్స్, యాహూ స్టాక్స్ తదితర యాప్ లు టాప్ టెన్ లో ఉన్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more