Telangana congress meeting

telangana congress, ponnala laxmaiah, telangana congress leaders, t congess, aicc, inc, telangana, ap congress, andhrapradesh, delhi, hyderabad, latest news, kcr, future, course

telangana congress leaders meeting to discuss on future plans : telangana congress two day meeting to discuss of future course is starting today

భవిష్యత్తు వెతుకులాటలో టీ.కాంగ్రెస్

Posted: 08/24/2014 09:24 AM IST
Telangana congress meeting

 

తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు వెతుకులాటలో పడింది. మేలో ఎన్నికల దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయిన హస్తం నేతలు.., ప్రజలు అభయహస్తం ఇవ్వకపోవటంతో కోలుకోలేకపోతున్నారు. అటు కేంద్రంలో ఇటు తెలుగు రాష్ర్టాల్లో చతికిలబడ్డ కాంగ్రెస్ గళం విన్పించేందుకు కూడా ఆలోచించాల్సి వస్తోంది. తమ భవిష్యత్తు ఏమిటని నేతలు మేధోమధనం చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు సమావేశం అవుతున్నారు. ఆది, సోమవారాల్లో రెండ్రోజుల పాటు టి.కాంగ్రెస్ సమావేశాలు నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర్లోని శ్రీ ఇందు కాలేజీలో ఈ సమావేశం జరుగుతోంది. రెండ్రోజుల సమావేశం కోసం దాదాపు పది అంశాలను గుర్తించారు. వాటిపై సమావేశంలో చర్చించేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ.., ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీయగా.., ఏపీలో అయితే కనీసం ఒక్క  సీటు కూడా గెలుచుకోకుండా రికార్డు నెలకొల్పుకుంది. ఇక ప్రజలు కోరుకున్న ప్రత్యేక రాష్ర్టం ఇచ్చిన తెలంగాణలో కూడా ఆదరణకు నోచుకోలేక ప్రతిపక్షంలో కూర్చుంది. ఈ రెండ్రోజుల పాటు జరిగే తెలంగాణ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రదానంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు.., పార్టీ బలపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరగనుంది. ఫీజు రి ఎంబర్స్ మెంట్, సంక్షేమ పధకాల అమలులో జరుగుతున్న జాప్యం వంటి ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు.., పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించటం.., కార్యకర్తల నమోదు వంటి అంశాలపై చర్చ జరిపి నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండ్రోజుల్లో వీరు భవిష్యత్తును ఎలా నిర్ణయించుకుంటారో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  congress  latest news  meeting  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more