బ్రహ్మంగారు చెప్పిన కలియుగ అంతం దగ్గరపడుతోంది. అందుకే ఇలాంటి వార్తలు వింటున్నాం. ప్రపంచంలో గతంలో ఎక్కడా ఈ ఘటన చూసుండరు.., కనీసం విని కూడా ఉండరు. తన భర్త మరో అమ్మాయితో మాట్లాడితేనే భార్యలు సహించరు. ఇక వారితో సంబంధం పెట్టుకుంటే ఏ మైనా ఉందా ఇళ్ళు పీకి పందిరేస్తారు. కాని ఇక్కడ స్వయంగా భార్యనే తన భర్త మరో మహిళతో పడుకుంటే చూడాలనుకుంది. ఇదంతా విదేశాల్లో అనుకుంటే పొరపాటే. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే మన భారత దేశంలోనే ఈ వైపరిత్యం వెలుగు చూసింది. తన క్లోజ్ ఫ్రెండ్ ను భర్తతో పడుకోవాలని కోరిందో మహిళ. ఇందుకోసం బలవంతం చేయటంతో పాటు చివరకు బెదిరింపులకు దిగటంతో భయపడ్డ బాధితురాలు పోలిసులకు ఫిర్యాదు చేసింది. పైత్యం పీక్ స్టేజ్ కు చేరి విపరీతంగా ప్రవర్తిస్తున్న ఆ మహిళా బంధును పోలిసులు అరెస్టు చేశారు.
బాధితురాలి కధనం ప్రకారం.., బెంగళూరుకులోని ఓ మహిళకు ఇంటి దగ్గర ఉండే మరో మహిళతో ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఇద్దరు మొగుళ్ళు ఉద్యోగాలకు వెళ్తుండటంతో వీరు కాలక్షేఫం కోసం మాట్లాడుకునేవారు. అలా ఒకరికొకరు బాగా క్లోజ్ అయ్యారు. చివరకు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. తన స్నేహితురాలిని ఓ సాయం చేసి పెట్టాల్సిందిగా అడగటంతో నీ కోసం ఆ మాత్రం చేయనా ఏంటో చెప్పు అంటూ ఆ అమాయకురాలు అడిగింది. దీంతో చాలాకాలంగా మనసులో దాచుకున్న దౌర్బాగ్యపు ఆలోచనను బయట పెట్టింది. తన భర్తతో క్లోజ్ ఫ్రెండ్ పడుకుంటే చూడాలని ఉందని. ఇది విన్న భాదితురాలు ఖంగుతిన్నది. ఇదేమిటి ఇలా అడిగింది. దీనికేమైనా మతి పోయిందా అని అనుకుంది. ఎలాగైనా ఒప్పుకుని తన భర్తతో పడుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో చిర్రెత్తిన అవతలి మహిళ సీరియస్ అయంది. మతి ఉండే మాట్లడుతున్నావా లేక.., ఏ మైనా అయిందా అని ప్రశ్నించింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఆ ప్రస్తావన రాకుండా వీరి ఫ్రెండ్ షిప్ నడిచింది.
కాని మెదడులో పుట్టిన పురుగు ఊరుకోదు కదా. మళ్ళీ వారం రోజుల తర్వాత సమయం చూసుకుని మరోసారి తన మంచి మనసులోని మాటను స్నేహితురాలికి చెప్పింది. అయితే ఈ సారి కాస్త సీరియస్ అయింది. తన భర్తతో పడుకోవాలని లేదంటే ఆయన నిన్ను చంపేస్తాడు అని హెచ్చరించింది. దీంతో ఏం చేయాలో ముందుగా అర్ధం కాలేదు. చివరకు భర్తకు విషయం చెప్పేసింది. ఇద్దరూ కలిసి పోలిసులకు ఫిర్యాదు చేశారు. కంప్లయింట్ అందుకున్న ఖాఖీలు.., ఆ పతివ్రతను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు కూడా వారి ముందు అవును నా భర్తతో ఫ్రెండ్ ను పడుకోమని అడిగాను అని సగర్వంగా ఒప్పుకుంది. ఇదేం ఆడదిరా అనుకున్న పోలిసులు.., ఏమి చేయలేక కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆమెకి విపరీత బుద్ది ఎందుకు పుట్టిందంటే.., తన ముందు ఎవరైనా రొమాన్స్ చేసుకుంటుంటే చూడటం అంటే చాలా సరదా అట. ఈ విషయం తెలిసిన వారంతా నీ సరదా సంతకెత్తుకెళ్ళ.., ఇదేం పోయే కాలం అని అనుకుంటున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more