Mulayam says he is ready to join hands with maya

mulayam singh yadav, samajwadi party, akhilesh yadav, dimple yadav, mayawati, bahujan samaj party, bsp mps mla's, sp mps mlas, lalu prasad yadav, rastreey janata dal, rabri devi, lalu case, lalu arrest, nitish kumar, sharad yadav, janata dal united, jdu, uttar pradesh, bihar, bjp, modi, latest news, political news

mulayam singh indicates that he is ready to work with mayawathi to defeat bjp : mulayam willing to work with mayawathi if lalu mediates between them

టార్గెట్ బీజేపి. ఎవరైనా ఒకే !

Posted: 08/13/2014 02:46 PM IST
Mulayam says he is ready to join hands with maya

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఉండరు. అవసరాన్ని బట్టి కొందరు శత్రువులవుతారు, సమయాన్ని బట్ట కొందరు మిత్రులవుతారు. ఇప్పుడిదే జరుగుతోంది దేశంలో. ఇప్పుడేంటి ఎప్పటి నుంచో జరుగుతుందనుకోండి. సంకీర్ణ కూటములకు అలవాటు పడ్డ మన పార్లమెంటు వ్యవస్థకు సంపూర్ణ బలాన్ని అందిస్తూ ఈ దఫా ఎన్నికల్లో బీజేపి విజయం సాధించింది. అయినా సరే మిత్రపక్షాలపై గౌరవంతో వారిని కలుపుకుని పోయి ప్రభుత్వాన్ని నడుపుతోంది. కమల వికాసానికి కాంగ్రెస్ పార్టీయే చతికిల బడింది ఇక ఇతర పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు. అయితే చిన్నా చితకా పార్టీలు ఇప్పుడు ఒకటవుతున్నాయి. చీమల దండులా ముందుకు వస్తున్నాయి. బీహార్ లో రాజకీయ శత్రువులుగా ఉన్న జేడీయూ, ఆర్జేడీ ఒక్కటయ్యాయి. నిత్యం తిట్టిపోసుకునే నితీష్, లాలూ ఇప్పుడు కలిసి కాఫీ తాగుతున్నారు.

మాయతో కలిసేందుకు ములాయం ఆసక్తి

శత్రువు శత్రువు మనకు మిత్రుడవుతాడు అనే సామెత గుర్తుంది కదా. ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు ఇది కరెక్టుగా సరిపోతుంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ప్రదాన రాజకీయ పక్షాలు. గతంలో మాయ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఎస్పీ తరపున అఖిలేష్ సీఎంగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా తిట్టుకోని రోజు లేదు. విమర్శించుకోని నిమిషం ఉండదు. ఒకరి విధానాలపై మరొకరు ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నారు. అయితే వీరిద్దరికీ ఉమ్మడి రాజకీయ శత్రువు బీజేపి. కొండను ఢీ:కొట్టాలంటే ఒక బండరాయి సరిపోదని భావించి అంతా ఒక్కటవ్వాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళు తిట్టుకున్న నేతలు ఇప్పుడు మొహంలో మొహం పెట్టి నవ్వుకోవటానికి కాస్త మొహమాటపడుతున్నారు. అందుకే కలవాలని ఉన్నా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా చొరవతీసుకుంటే మ్యాటర్ సెటిల్ అవుతుందని చెప్తున్నారు. ఆర్జేడి అధినేత లాలూ మద్యవర్తిత్వం వహిస్తే మాయావతితో కలిసి పనిచేయటానికి సిధ్ధమన్నారు ములాయం. కామన్ కష్టంపై కలిసి పోరాడేందుకు సై అంటున్నారు.

సారి చెప్తే సరిపోతుంది

అక్కడికి బీఎస్పీ కూడీ తక్కువ తినలేదు. తమకు కూడా కలిసి పనిచేయాలని ఉన్నట్లు పరోక్ష సంకేతాలిస్తోంది. అయితే తమ ఇగో సాటిస్ఫై అయ్యేందుకు సారీ చెప్పాలట. ఏనుగు సైకిలెక్కాలంటే కండిషన్స్ అప్లై అంటున్నారు. ఇందుకు వారు కారణాలు కూడా చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో ఎస్పీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారని.., పరిపాలనను అస్తవ్యస్తం చేశారని వీరు ఆరోపిస్తున్నారు. చేసిన తప్పుకు ముందుగా క్షమాపణ చెప్తే ఆ తర్వాత కలిసి పనిచేయటంపై ఆలోచిస్తామని మాయ వర్గం చెప్తోంది. యూపీలో ఉమ్మడిపోరుపై తుది నిర్ణయం మాయదే అని బీఎస్పీ నేతలు స్పష్టం చేస్తున్నారు. నిన్నట వరకూ కయ్యానికి కాలు దువ్వుకున్న పార్టీలు, నేతలు కలిసి పనిచేయటం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పదవుల కోసం నేతలు ఏ పనైనా చేస్తారని తెలుసు కానీ పాలిటిక్స్ ఇంతలా మనుషుల్ని, వారి విధానాలను మారుస్తాయా అనుకుంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mulayam  mayawati  lalu prasad yadav  nitish kumar  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more