కపట నాటకాలు, వెన్నుపోటులు, మేకపోతు గాంభీర్యాలకు పెట్టని పేరయిన పాకిస్థాన్ మోడి కామెంట్లపై స్పందించింది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా తమకేమి తెలియదని చెప్తోంది. ఇన్ని రోజులుగా ఎలాంటి చర్చల పిలుపు ఇవ్వని దాయాది దేశం మోడి మాటలతో మేల్కొంది. తాము భారత్ కు వ్యతిరేకంగా ఏ కుట్రలూ చేయటం లేదని చెప్పుకుంది. పాకిస్థాన్ ప్రపంచ శాంతిని ముఖ్యంగా భారత్ అబివృద్ధిని కోరుకునే దేశమని చెప్పుకుంది. మంగళవారం కార్గిల్ పర్యటనలో మోడి చేసిన వ్యాఖ్యలు తమను ఎంతగానో బాధించాయని పాక్ పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. మోడి ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేశారని భావిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.
ఓన్లీ టాక్స్..., నో బ్లేమింగ్స్
ఉగ్రవాదం విషయంలో తమను బ్లేమ్ చేస్తున్నారని అనవసర ఆవేదన వ్యక్తం చేస్తోంది పాకిస్థాన్. తమ దేశ పౌరులు ఎవరూ భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేయటం లేదనీ.., పాక్ ఆర్మీ అసలు చేయటం లేదని అసత్య ప్రకటనను పలికింది. పాక్ ఆర్మీ కుట్రలపై ఆధారాలు ఉన్నాయి అని మోడి స్పష్టంగా చెప్పినా.., చూపించండి అనకుండా ఆధారాలు లేకుండా మాట్లడుతున్నారని డొంకతిరుగుడు మాటలు చెప్తోంది. అటు తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నామన్న భారత ప్రధాని వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నట్లు గట్టిగానే చెప్పింది. అయితే ముంబై మారణహోమం సూత్రధారి హఫీజ్ సయాద్ పాక్ రోడ్లపై సెక్యురిటీ మద్య తిరగటంపై స్పందించలేదు. పరస్పరం బ్లేమ్ చేసుకోవటం ఇక ఆపాలని చివరగా పాక్ విదేశాంగ కార్యాలయం ఒక చక్కని మాటయితే చెప్పింది. విమర్శలకు బదులు సమస్యల పరిష్కరంపై దృష్టి పెట్టాలని పెద్దపెద్ద మాటలే చెప్పింది.
చర్చలు జరగాలని, శాంతి నెలకొనాలని భారత్ ఎప్పటినుంచో కోరుకుంటోంది. పాకిస్థాన్ నిజంగా చర్చలు జరగాలని కోరుకుంటే ఆదేశ ఆర్మీ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారత స్థావరాలపై ఎందుకు కాల్పులు జరుపుతోంది. భారత ప్రభుత్వం చెప్పినట్లు ఇక్కడి సైన్యం ఉంటుంది. అలాంటప్పుడు పాక్ ప్రభుత్వం మాట ఆ దేశ సైన్యం వినాలి. మరి సైన్యం మాట వినటం లేదా.., లేక సర్కారే సిగ్నలిచ్చి కాల్పిస్తోందా వారికే తెలియాలి. కాని మన ప్రభుత్వం ఒక్కసారి ఆర్మీకి అనుమతి ఇస్తే పాకిస్థాన్ ను ప్రపంచ పటం నుంచి చెరిపేసే సత్తా కలవారని ఆదేశానికి కూడా తెలుసు. మోడి చెప్పినట్లు యుద్ధం చేయటానికి పాక్ కు చేతకాదు. అందుకే భారత్ పై దొంగదెబ్బలు తీస్తూ అమాయక ప్రజలను బలితీసుకుని రాక్షసానందం పొందుతోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more