Unknown person enter in assembly

unknown person enter in assembly, unknown person cough in cctv telangana assembly, andhra pradesh assembly, unknown person caught in cctv camera in assembly

unknown person enter in assembly

అసెంబ్లీలో అపరిచితుడు

Posted: 07/30/2014 01:30 PM IST
Unknown person enter in assembly

హైద్రాబాద్ లో మూడంచల సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతగల అసెంబ్లీలోకి మంగళవారం రాత్రి ఒక మతిస్తిమితం లేని వ్యక్తి ప్రవేశించటాన్ని ఎవరూ కనిపెట్టలేకపోవటం సంచలనాన్ని సృష్టిస్తోంది. 

సిసి కెమేరాలు ఆ వ్యక్తి కదలికలను స్పష్టంగా రికార్డ్ చేసాయి.  బయట గేటు ఎక్కి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఆ మతి స్థిమితం లేని వ్యక్తిని సెక్యూరిటీ గార్డ్ లెవరూ గమనించకపోవటం, సిసి కేమెరాలలో కనిపిస్తున్నా ఎవరూ దాన్ని మోనిటర్ చెయ్యకపోవటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.  

ఆ వ్యక్తిని ఎవరూ అడ్డుకోకపోవటంతో అతను ఎమ్మెల్యేలు ప్రవేశించే ద్వారాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చెయ్యటం, ఆ పనిలో 80 శాతం విజయం సాధించటం కూడా జరిగింది కానీ సెక్యూరిటీవాళ్ళకి కనపడలేదు, వినపడలేదు.  అతనా పనులు చెయ్యటం, అద్దాల తలుపులను పగలగొట్టిన కుర్చీని వేసుకుని ఒక గంటసేపు దర్జాగా కూర్చోవటం కూడా సిసి కేమెరాలు రికార్డ్ చేసాయి.  

ఉదయం 8, 8.30 మధ్యలో కనిపెట్టిన సెక్యూరిటీ గార్డ్ లు ఆ మతి స్థిమితం లేకుండా ఉన్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనతో సెక్యూరిటీ విషయంలో పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more