Survey of india case on google

internet search engine break the survey of indian mapping rules, google latest news, google in problem, google break mapping rules, google break the mapping rules of india, survey of india case on google, google mapping rules, google maps, google crime news, the mapping places of india, google to be ban in india

The world famous internet search engine break the survey of indian mapping rules

‘‘గూగుల్’’ని భారత్ లో బ్యాన్ చేస్తారా..?

Posted: 07/28/2014 10:07 AM IST
Survey of india case on google

ప్రస్తుతం ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్లు ఎన్నో వున్నప్పటికీ వాటిన్నింటినీ తలదన్ని నేడు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది ‘‘గూగుల్’’! బహుశా ఈ సెర్చ్ ఇంజన్ లేకపోతే చాలాపనులు పెండింగ్ లో పడిపోయుండేవి. ఇది యువతరానికి కావల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడంతోపాటు ప్రభుత్వ రంగానికి కూడా ఎంతో తోడ్పడుతోంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఈ సెర్చ్ ఇంజన్ రూల్స్ ని అతిక్రమించి ప్రవర్తిస్తోందని అప్పుడప్పుడు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇదే తరహాలోనే గూగుల్ భారత్ సీబీఐ ఉచ్చులో బిగుసుకుపోయిందని తాజా సమాచారం!

2013వ సంవత్సరంలో ఈ సంస్థ మ్యాపింగ్ పోటీని నిర్వహించింది. అందులో ప్రజలు వుండే పరసర ప్రాంతాల్ని, ఆసుపత్రుల్ని, రెస్టారెంట్ల వివరాలను మ్యాపింగ్ చేయాల్సిందిగా అది ప్రజలందరినీ కోరింది. అయితే ఇటువంటి కార్యక్రమాలను ప్రారంభించే ముందు దేశంలో వున్న కొన్ని నియమనిబంధనల ప్రకారం భారత సర్వేయర్ జనరల్ కార్యాలయం అనుమతి తీసుకోవాల్సి వుంది. కానీ అటువంటివేమీ తీసుకోకుండానే ‘‘గూగుల్’’ తన పని తాను కానిచ్చేసింది. దీంతో భారత ప్రభుత్వం ఈ సంస్ధపై కన్నెర్రచేసింది.

తాజాగా ఈ వ్యవహారం మీద కేసు నమోదు చేశారు. ‘‘గూగుల్’’లో పొందుపరిచిన మ్యాప్ లను నిశితంగా సీబీఐ పరిశీలించనుంది. అందులో ‘‘గూగుల్’’ నియమనిబంధనల్ని అతిక్రమించి నిషేధిత ప్రాంతాలను కూడా మ్యాపింగ్ చేసేలా ప్రోత్సహించిందని వారు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకు సంబంధం లేని సున్నితమైన రక్షణ స్థావరాలను ఎలా మ్యాపింగ్ చేశారో తెలియజేయాలని సర్వే ఆఫ్ ఇండియా గూగుల్ కు సూచించింది. ‘‘గూగుల్’’ చేసిన ఈ ఓవరాక్షన్ ను అణిచేందుకు ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. మరీ దీనిపై గూగుల్ ఎలా సమాధానం ఇస్తుందో వేచి చూడాల్సిందే! దీంతో ‘‘గూగుల్’’ భారత్ లో తెరదించుకోవాల్సిందేనని కొంతమంది ప్రతిభావంతులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more