ఉస్మానియా యూనివర్సిటీ కేవలం మన హైదరాబాద్ లోనే కాదు... దేశవ్యాప్తంగా ఎన్నో పేరు ప్రతిష్టలను మూటగట్టుకున్న విద్యాసంస్థ. అటువంటి మహోన్నత విద్యా సంస్థ ఇప్పుడు అప్పుల్లో మునిగి తేలుతోందని తాజా సమాచారాలు వెలువడుతున్నాయి. సిబ్బంది వేతనాల చెల్లింపు కోసం యూనివర్సిటీ అధికారులు బ్యాంకు రుణాల కోసం పరుగులు పెడుతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. ఒకవైపు వ్యయాలు భారీగా పెరిగిపోతుంటే.. మరోవైపు ప్రభుత్వం విడుదల చేస్తున్న గ్రాంట్లకు మధ్య భారీ వ్యత్యాసం వుంటోందని... ఇటువంటి పరిణామాల వల్ల యూనివర్సిటీ ఇంకా అప్పుల ఊబిలో కూరిపోయేలా చేస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఉస్మానియా వర్సిటీలో బోధన - బోధనేతర సిబ్బంది వేతనాలు, యూనివర్సిటీ నిర్వహణకు సంబంధించి మొత్తం వ్యయం దాదాపు 27 కోట్ల మేర వరకు వుంటుంది. అయితే ప్రభుత్వం నుంచి వీరికి కేవలం రూ.14 కోట్ల మాత్రమే ఫండ్లు విడుదలవుతున్నాయి. అదికూడా నెలకు ఒకసారి కాదు... వారికి వీలు కుదిరినప్పడు.. అంటే మూడు లేదా నాలుగు నెలలకొకసారి ప్రభుత్వం నిల్వలను విడుదల చేస్తోంది. దీంతో ఓయూ యాజమాన్యం వారికి వేతనాలు చెల్లించడంలో తీవ్ర లోటు ఏర్పడుతోంది.
తాజాగా 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో క్వార్టర్ నిధులు ఇంతవరకు విడుదల కాలేదు. దీంతో జూన్ నెలలో ఇవ్వాల్సిన వేతనాలను చెల్లించేందుకు ఓయూ బ్యాంకుల నుంచి రుణాల తీసుకుని గట్టెక్కింది. ఒక జూలై కూడా 10 రోజుల్లో ముగియనుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా నిల్వలు విడుదల కాకపోవడంతో వర్సిటీ అధికారులు ఆందోళనల్లో మునిగిపోయారు. పైగా ఏటా పెరుగుతున్న పెన్షన్లు కూడా వర్సిటీగా భారంగా మారుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం వర్సిటీ అధికారులను అప్పుల బాధ నుంచి బయటికి రప్పిస్తాయో లేదో వేచి చూడాల్సిందే !
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more