Solution for obesity from child hood

Solution for obesity from child hood, Central Govt to ban obesity causing foods at schools, Schools should be free of junk foods, Junk foods causing obesity in children

Solution for obesity from child hood found by Central Government

చిన్నప్టటినుంచే ఊబకాయం ఆరోగ్య సమస్యలకు ఒక పరిష్కారం

Posted: 07/17/2014 09:29 AM IST
Solution for obesity from child hood

ఒక వైద్యుని డిస్పెన్సరీ వరండాలోనే సమోసాలు, పానీ పూరీ దుకాణం ఉంటే అది చట్టరీత్యా నేరమేమీ కాదు.  కానీ అక్కడ తినండి, ఇలా లోపలికి రండి అని ఆ హాస్పిటల్ యాజమాన్యం చెప్పినట్లుంటుంది.   బయట తిండితో జబ్బులు తెచ్చుకోండి, లోపలికి వచ్చి వైద్యం చేయించుకోండి అని, ఇంకా, బయట డబ్బులు కట్టి రోగాలు తెచ్చుకోండి, లోపల మళ్ళీ డబ్బులు కట్టి వాటిని నయం చేయించుకోండి అన్నట్లు కూడా ఉంటుంది.  అయితే చట్టంలో సవరణ చేస్తే మాత్రం అలాంటివి చట్ట వ్యతిరేకాలవుతాయి.  దేవాలయాలు, విద్యాలయాల పక్కన మద్యం దుకాణాన్ని సమ్మతించరు కదా.  

అలాగే చిన్నప్పటి నుంచే పిల్లలను ఊబకాయులను చేస్తున్న పదార్థాలను విక్రయించే దుకాణాలను పాఠశాలల పక్కన పెట్టనివ్వ గూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  పాఠశాలల్లో చదువుకునే చిన్న పిల్లలు బయట లభించే పదార్థాలను తినరాదని పాఠశాల యాజమాన్యం చెప్తుంది.  పెద్దలు కూడా పిల్లలకు జాగ్రత్తలు చెప్పే పంపిస్తారు.  ఏవేవో కలిపి చేస్తారు, శుభ్రంగా చెయ్యరు, ఈగలు వాలుతుంటాయి, దుమ్ము ధూళి పడ్డ పదార్థాలను తింటే జబ్బులు వస్తాయి అంటూ పిల్లలకు చెప్తారు.  కానీ పరిశుభ్రంగా ఉన్నా ఊబకాయం వచ్చే పదార్థాల గురించి మాత్రం చెప్పకపోవటం శోచనీయం.  పైగా ఆధునికత పేరుతో జంక్ ఫుడ్స్ కి అలవాటవటం గమనిస్తూనే ఎక్కువగా చెప్పలేకపోతున్నారు.  

ఇది గమనించే ఉప్పు, పంచదార, కొవ్వు పదార్థాలు ఎక్కువ పాళ్ళల్లో ఉన్న చిరుతిండి, కార్బొనేటెడ్ పానీయాలను పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో పెట్టనీయగూడదని నియమాన్ని తీసుకునిరావటానికి కేంద్ర మాధ్యమిక  విద్యా మండలి సిఫారస్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం యోజనలు చేస్తున్నట్టుగా లోక్ సభలో ప్రకటన చేసింది.  వీటి స్థానంలో పండ్ల రసాలు, పాల ఉత్పాదనలు, ఆరోగ్యకరమైన చిరుతిండి విక్రయాలను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.  

ఆహార భద్రతా ప్రమాణాల అధికార సంస్థ దీన్ని అధ్యయనం చెయ్యటానికో నిపుణుల సంస్థను అక్టోబర్ 2013 లో ఢిల్లీ హైకోర్ట్ ఆదేశాలమేరకు నియమించటం జరిగింది.  పిల్లలలో చిన్నప్పటి నుంచే ఊబకాయానికి, వివిధ ఆరోగ్య సమస్యలకు జంక్ ఫుడ్స్ కారణమని గుర్తించిందా కమిటీ.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more