కృష్ణా డెల్టాకు నీటి విడుదల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మరోవారం పాటు నీటి విడుదల కొనసాగించాలన్న కృష్ణా రివర్- బోర్డు నిర్ణయంపై తెలంగాణ సర్కార్ -భగ్గుమంది. రాష్ట్రం ఏర్పడిన నెల రోజులకే పరిస్థితి ఇలా ఉంటే... భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో అన్న సందేహాలు వ్యక్తం చేస్తోంది. కృష్ణా జలాల కోసం ఏపీ, తెలంగాణ సై అంటే సై అనుకునే స్థితికి చేరుకున్నాయి. కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య అగ్గి రాజుకుంది. నీటి విడుదల కోసం ఏపీ పట్టుబడుతుండగా... ఇచ్చేందుకు తెలంగాణ ససేమిరా అంటోంది.
ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య గొడవ ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మంచినీటి అవసరాల కోసం కృష్ణా డెల్టాకు పది టీఎమ్-సీలు కావాలని ఏపీ పట్టుబట్టింది. అయితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. మధ్యేమార్గంగా మూడున్నర టీఎమ్-సీలు దిగువకు విడుదల చేయాలని కృష్ణా రివర్ -బోర్డు నిర్ణయించింది. దీని ప్రకారం ప్రతిరోజు 600 క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీటిని విడుదల చేశారు. వారం రోజుల గడువు ముగియడంతో నాగార్జున సాగర్ గేట్లు దించి నీటి విడుదలను నిలిపివేశారు.
అయితే కృష్ణా డెల్టాకు కేవలం 2.74 టిఎంసిల నీరు మాత్రమే చేరుకుందని... మరోసారి అదనపు నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల యాజమాన్య సంస్థ చైర్మన్ పాండ్యాకు విజ్ఞప్తి చేసింది. దీంతో తాజాగా ఆయన మరోసారి నీరు విడుదల చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు.
అయితే తమ అవసరాలు తీరలేదంటూ.... నీటి విడుదల కొనసాగించాలని ఏపీ కోరింది. ఏపీ కోరిక మేరకు మరో వారం రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు టీ సర్కార్ కు లేఖరాసింది. ఆ లేఖపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిపై సమీక్ష సీఎం కేసీఆర్ -సమీక్ష నిర్వహించనున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర జలసంఘం ఛైర్మన్ పాండ్యేకు ఫోన్ చేసి... తమతో సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. టీ సర్కార్ -అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
విభజనకు ముందే ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు వస్తాయని నిపుణులు అంచనా వేసారు. రాష్ట్రం ఏర్పడిన నెల రోజుల్లోనే నీటి విడుదలపై వివాదం నెలకొంది. ఇక తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు నిర్మించనున్న నేపథ్యంలో.... భవిష్యత్తులో ఈ వివాదాలు మరింత తీవ్రమవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటకను దాటుకొని నీరు దిగువకు రావడం గగనంగా మారింది. ఇప్పుడు తెలంగాణ కూడ పేచీ పెడుతుండడంతో భవిష్యత్-పై కృష్ణా డెల్టా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more