Dr harsh vardhan on sex education

dr harsh vardhan on sex education, ban of sex education by health minister, union health minister dislikes sex education, dr harsh vardhan comments on condoms

dr harsh vardhan on sex education

సెక్స్ ఎడ్యుకేషన్ వద్దన్లే- ఆరోగ్యశాఖామాత్యుల వివరణ

Posted: 06/28/2014 01:04 PM IST
Dr harsh vardhan on sex education

ఇప్పటికే కండోమ్స్ విషయంలో వార్తలలోకి ఎక్కిన కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు డా.హర్ష వర్ధన్ తాజాగా ఆయన తన వెబ్ సైట్ drharshvardhan.com లో రాసిన ఉద్దేశ్యాలతో వ్యతిరేకత రావటంతో దానికి వివరణనిస్తూ స్కూళ్ళల్లో సెక్స్ ఎడ్యుకేషన్ వద్దని తను అనలేదని, కేవలం బూతు రూపంలో దాన్ని చెప్పవద్దని నా ఉద్దేశ్యమని అన్నారు.  సెక్స్ ఎడ్యుకేషన్ ని నిషేధించాలి అని తన వెబ్ సైట్ లో రాసిన మంత్రివర్యులే దాని మీద వ్యతిరేకత వస్తుండటంతో, అది అవసరమే కానీ జుగప్సాకరంగా ఉండకూడదు, బూతు అర్థంలోకి రానివ్వగూడదు అని అన్నారు.

యుపిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెక్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భారత సనాతన వ్యవస్థను దెబ్బతీసే విధంగా బొమ్మలతో, సంకేతాలతో ఉందని, అది సెక్స్ ఎడ్యుకేషన్ అనిపించుకోదని హర్షవర్ధన్ అన్నారు.  పాఠ్యభాగాలు ఆదర్శప్రాయంగా ఉండాలన్నదే నా ఉద్దేశ్యమని వివరణనిచ్చారు.

వ్యతిరేక స్పందనను తగ్గించటానికి ఆ విధంగా హర్షవర్థన్ ఇచ్చిన వివరణ మరింత వ్యతిరేకతను తెచ్చిపెట్టాయనటానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధఇ రణదీప్ సుర్జేవాలా మాటల్లో అర్థమౌతోంది.  ఏ స్కూల్లో అలా బూతు అర్థాలతో చెప్తున్నారో చెప్పండి అంటూ ఆయన సవాల్ విసిరారు.  

హర్షవర్ధన్ వెబ్ సైట్ లో పాఠ్యాంశాలు ఎలా ఉండాలన్న విషయంలో చేసిన పై వ్యాఖ్యతో పాటు విలువలు కలిగిన విద్యాబోధన చెయ్యమని, యోగా ని ప్రవేశపెట్టమని చెప్పటం జరిగింది.  

2007 లో యుపిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడాలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం మీద యుపిఏ పాలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అభ్యంతరాలు తెలియజేసారని, దానితో దాన్ని సంస్కరిచారని హర్షవర్ధన్ గుర్తుచేసారు.  9, 11 వ తరగతులలో చదివే విద్యార్థులకోసం ప్రవేశపెట్టిన అడాలసెంట్ ఎడ్యుకేషన్ పట్ల తనకు అభ్యంతరాలేమీ లేవని, ఎయిడ్స్ మీద అవగాహనకు అది అవసరమేనని ఆయన అన్నారు.  

సెక్స్ ఎడ్యుకేషన్ లక్ష్యాలు ఎలా ఉండాలంటే లింగ వివక్ష, చిన్న వయసులో గర్భం దాల్చటం, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాపించటం, పోర్నోగ్రఫీకి బానిసలవటం లాంటి నుండి వాళ్ళను తప్పించాలని హర్షవర్ధన్ అన్నారు.  

కానీ విమర్శలు చేసేవారు ఇంకా చేస్తూనేవున్నారు.  భాజపా విధానాన్ని కూడా దుయ్యపడుతున్నారు.  ఒక డాక్టరైయ్యుండి, ఆరోగ్యశాఖకు మంత్రిగా వ్యవహరిస్తూ సెక్స్ ఎడ్యుకేషన్ వద్దని అనటం సబబుగా లేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.  కండోమ్స్ విషయంలో ఆయన లండన్ లో చేసిన వ్యాఖ్యల మీద రేగిన దుమారం ఇంకా అణగిపోకముందే ఆయన సెక్స్ ఎడ్యుకేషన్ మీద చేసిన వ్యాఖ్యలు మరోసారి వ్యతిరేక స్పందనను కలిగిస్తోంది.  

యువతకు నీతి పాఠాలు మానుకోమని సలహాలిస్తున్నారు.   

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more