Tv9 and abn telecasts blocked in telangana at the orders of telangana leaders

TV9 banned in Telangana, ABN banned in Telangana, KCR orders TV9 and ABN to be blocked, Press in Telangana

TV9, ABN Andhra Jyothy TV channels blocked by SMOs at the order of TEangana Chief

TV9, ABN ప్రసారాల నిలిపివేత - ప్రజాస్వామ్య తెలంగాణ ఇదేనా?

Posted: 06/17/2014 08:11 AM IST
Tv9 and abn telecasts blocked in telangana at the orders of telangana leaders

తెలంగాణ గడ్డపై టీవీ 9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు బందయ్యాయి. ఎమ్మెస్వోలు టీవీ 9 ప్రసారాలను బంద్ చేసారు.అయితే నెట్ సదుపాయం వున్నవారు యూ ట్యూబ్ లో, డిష్ సదుపాయం వున్నావారు టీవీలో ఎప్పటిలాగే చూసుకోవచ్చు. ఈ టీవీ చానల్స్ కూడా మితిమీరి అందరిమీద వ్యంగంగా ప్రసారాలు చెయ్యటం ఎంత వరకు సబబు?

తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని తెలంగాణ ఎంఎస్వోలు తీసుకున్న నిర్ణయాన్ని పలు పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నిర్ణయం అప్రజాస్వామికమని.. ఇది భావప్రకటన స్వేచ్ఛకు తీవ్రవిఘాతం కలిగించడమేనని ఆందోళన వ్యక్తం చేశాయి.

తెగేదాకా లాగడం టీవీ 9 కు కూడా ఇష్టం వున్నట్లు లేదు.అందుకే ఆ బుల్లెట్ల కార్యక్రమాన్ని నిలిపివేసి, సిబ్బందిపై చర్యతీసుకున్నట్లు ప్రకటించింది. వున్నవి లేనివి కల్పించి, Satires వేసి అందరిని కించపరిచే కార్యక్రమాలు ఈ టీవీ చానల్స్ కూడా ఆపాలి. ముందు Image ని Damage చేసి తర్వాత క్షమాపణలు చెప్పటం ఏమిటి?

గిట్టని మీడియా సంస్థలను అణచివేయాలనుకోవడం, టీవీ చానెళ్ల ప్రసారాలు బంద్ చేయించాలనుకోవడం అత్యంత ప్రమాదకర ధోరణి. దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు సమాజంపై పడతాయి. కడచిన పదేళ్లలో చోటుచేసుకున్న పరిణామాల వల్ల తెలుగునాట ఇప్పటికే వాతావరణం పూర్తిగా కలుషితం అయింది. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉండవు. ఒక వ్యవస్థ అదుపు తప్పితే దాన్ని నియంత్రించడానికి మరెన్నో వ్యవస్థలను ఏర్పాటుచేసుకున్న గొప్ప దేశం మనది.

 పత్రికల ప్రచురణల్లో, టీవీ ప్రసారాల్లో అసత్యాలుంటే ప్రభుత్వాలు ఖండించవచ్చని.. తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయలేదని ఐజేయూ నేత దేవులపల్లి అమర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రమంటే ఎంఎస్వోల గుత్తాధిపత్యమా అని ప్రశ్నించారు. మద్యం ఇసుక మాఫియాల్లా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎంఎస్వోలను కట్టడి చేయకపోతే టీవీ యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేసినట్లే ప్రభుత్వాలనూ బ్లాక్మెయిల్ చేస్తాయని ఐజేయూ నేత శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు.

పౌరులకు సమాచారం తెలుసుకునే హక్కుందని, ప్రసారాలను ఆపేసిన ఎంఎస్వోల పై చర్యల తీసుకోవాల్సిందేనని అన్నారు. ప్రసారాలను నిలిపివేసే హక్కు ఎంఎస్వోలకు ఎక్కడిదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు అమర్నాథ్ ప్రశ్నించారు. వెంటనే ఎంఎస్వోలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ధోరణికి ఆదిలోనే అడ్డుకట్ట పడని పక్షంలో ఇవ్వాళ 'ఏబీఎన్', 'టీవీ-9'  ఆగ్రహానికి గురైనట్లు రేపు మిగతా చానెళ్లు మరొకరి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. అంతదాకా ఎందుకు? రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా మరొకరు వచ్చి  'టీ-న్యూస్' ప్రసారాలను బంద్ చేయించరని గ్యారెంటీ ఏమిటి? ప్రమాదకరమైన ఆటను ఎవరు ప్రారంభించినా, వారే దానికి బలవుతారన్నది చరిత్ర చెప్పిన సత్యం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more