Nandigama mla tangirala prabhakara rao died

Nandigama MLA Tangirala Prabhakara Rao died, Nandigama MLA, Tangirala Prabhakara, Krishna District

Nandigama MLA Tangirala Prabhakara Rao died, Nandigama MLA, Tangirala Prabhakara, Krishna District

టీడీపీకి షాక్ : ఎమ్మెల్యే తంగిరాల హఠాన్మరణం

Posted: 06/16/2014 07:58 AM IST
Nandigama mla tangirala prabhakara rao died

టీడీపీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే పలు ప్రమాదాల్లో కీలక నేతల్ని కోల్పోయిన ఆ పార్టీ ఇప్పుడు మరో నేతని కోల్పోయింది. కృష్ణాజిల్లా నందిగామ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అయిన తంగిరాల ప్రభాకర రావు (64) గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు. ఆదివారం 11.30లకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు మదర్‌థెరిస్సా ఆస్పత్రికి తరలించారు. అయినా లాభం లేకపోయింది. ఆయన అర్థరాత్రి 12 దాటిన తరువాత మృతి చెందారు. .టీడీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ప్రభాకర్ 2009లో తొలిసారిగా నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు వీరులపాడు జెడ్పీటీసీగా, ఎంపీపీగా పనిచేశారు. కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య గతంలోనే మరణించింది. ఆదివారం ఉదయమే ఆయన మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలసి పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు. ఇంతలోనే ఆయన గుండెపోటుతో మరణించాడనే వార్తను టీడీపీ శ్రేణులు నమ్మలేక పోతున్నారు. ఈ

యన బౌతిక ఖాయాన్ని ప్రజల సందర్శనార్థం స్టానిక కేవీర్ కళాశాల ఆవరణలో ఉంచారు. తన అభిమాన నాయకుడ్ని చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిజాయితీ పరుడుగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న తంగిరాల మరణాన్ని మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య జీర్ణించుకోక పోతున్నారు. ఆయన భౌతిక ఖాయానికి నివాళలు అర్పించి సంతాపాన్ని తెలియజేశారు. తంగిరాల మృతి పై చంద్రబాబు తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశాడు. ఆయన భౌతిక ఖాయానికి నివాళలు అర్పించేందుకు నందిగామ బయలుదేరి వెళ్ళనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more