అదను దలంచి కూర్చి ప్రజ నాదర మొప్పవిభుండు కోరినన్
గదిసి పదార్థ మిత్తు రటు కానగ వేగమె కొట్టి తెండనన్
మొదటికె మోసమౌఁ, బొదుఁగుమూలమూగోసినఁ బాలుగల్గునే
పిదికినఁగాక భూమిఁ బశు బృందము నెవ్వరికైన భాస్కరా!
టీకా : అదనుదలంచి = సమయము తెలుసుకోవడం ; కూర్చి = సమావేశపరిచి ; విభుండు = రాజు ; అదరమొప్ప = ఆదరణముతో ; కోరినన్ = ధనం కావాలని కోరుకోవడం ; కదిసి = కూడుకొని ; పదార్థ మిత్తురు = ధనం లేదా పదార్థాలు ఇవ్వడం ; అటు కానక = అట్టి వీలు కాని పరిస్థితిలో ; కొట్టి = దౌర్జన్యంతో ; తెండు అనన్ = కప్పము నిండిన ; మొదటికిన్ = తన అధికారానికే ; మోసము ఔన్ = ముప్పు కలగుట ; పశుబృందమున్ = పశువుల సముదాయం ; పాలు గల్గునే = పాలు లభించునా? ; పొదుగు మూలము కోసినన్ = పొదిగిన మొదలను గోయటం
తాత్పర్యము : మానవుడు పశువులను పిదికితే పాలు వస్తాయి గానీ.. పొదుగు గోసిన పాలు రానట్లే అధిపతి సమయం చూసి ప్రజలను పిలిచి, వారి అవసరాలను ఆదరంగా అడిగి తెలసుకుని ధనమిస్తారు గానీ.. దౌర్జన్యంగా కొట్టి ఇవ్వరు. అలా చేయరు సరికదా.. అలా చేస్తే వారి అధికారానికే ముప్పు కలుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Apr 15 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో... Read more
Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more
Apr 12 | ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును... Read more
Apr 11 | ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!... Read more
Apr 08 | ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా... Read more