Lakshmi's Veeragrandham Maker Complaint AP DGP | లక్ష్మీపార్వతి నుంచి కాపాడండి: ఏపీ డీజీపీకి కేతిరెడ్డి ఫిర్యాదు

Ap dgp complained about lakshmi parvathi

Lakshmi's Veeragrandham, Ketireddy Jagadishwar Reddy, Ketireddy Meets AP DGP Sambasiva Rao, Lakshmi's Veeragrandham Sambasiva Rao, Lakshmi Parvathy Serious Ketireddy

Lakshmi's Veeragrandham Maker Ketireddy Jagadishwar Reddy Complaint AP DGP Sambasiva Rao. He Face Threat from Lakshmi Parvathy he said.

లక్ష్మీపార్వతిపై డీజీపీకి కేతిరెడ్డి ఫిర్యాదు

Posted: 11/15/2017 05:34 PM IST
Ap dgp complained about lakshmi parvathi

వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నుంచి తనకు ప్రాణహాని ఉందని... తనను రక్షించాలని 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా దర్శకుడు కేతినేని జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఏపీ డీజీపీ సాంబశివరావును కలసి ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్ సందర్భంగా తనను గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అయ్యారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని తెలిపారు. చిత్ర ఓపెనింగ్ షాట్ లో పోలీసులు అడ్డుకోవటం.. ఆపై నిమ్మకూరులో షూటింగ్ ను గ్రామస్తులు కొందరు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ లీడ్ రోల్ పోషిస్తుందన్న వార్త ఉత్తదేనని తేలిపోయింది.

మరోవైపు, ఎన్టీఆర్ సమాధిని నిన్న లక్ష్మీపార్వతి పాలతో కడిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేతిరెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. తన భర్త సమాధి వద్దకు వచ్చిన కేతిరెడ్డిలాంటి పాపులు... ఇక్కడ ఉచ్చరించకూడని పేర్లను పలికారని మండిపడ్డారు. తల్లి, చెల్లి ఉన్న ఎవరూ ఇలాంటి సినిమాలు తీయరని అన్నారు. కేతిరెడ్డిని 'ఓ ప్లాట్ ఫామ్ గాడు' అంటూ సంబోధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lakshmi Parvathy  Lakshmi's Veeragrandham  Ketireddy Jagadishwar Reddy  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more