Jagan Dhramavaram Road Show Highlights | ఒక మంచి అన్న‌య్యను సీఎం చెయ్యండి

Jagan road show in dharmavaram

YSR Congress Party, YS Jagan Mohan Reddy, YS Jagan Dharmavaram Roadshow, Dharmavaram Roadshow, Dharmavaram Mudipattu Roadshow

YS Jagan Mohan Reddy Road Show at Dharmavaram Mudipattu Village in Anantapur District.

ధర్మవరంలో జగన్ రోడ్ షో

Posted: 10/17/2017 06:30 PM IST
Jagan road show in dharmavaram

బ‌డుగుల‌కు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు పింఛ‌న్ కోసమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం ధ‌ర్మ‌వ‌రంలోని ముడిపట్టులో రాయితీ బకాయిల కోసం దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు వైఎస్ జగన్ సంఘీభావం తెలిపారు.‘మీ అన్న (జ‌గ‌న్‌) ముఖ్య‌మంత్రి అవుతాడు.. దాన్ని 45 ఏళ్ల‌కు త‌గ్గిస్తాడు.. అంద‌రం ఒక్కటై మ‌న‌ ప్ర‌భుత్వాన్ని తెచ్చుకుందాం’ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఒక మంచి అన్న‌య్య ముఖ్య‌మంత్రి స్థానంలో కూర్చుంటాడని తనను ఉద్దేశించి జ‌గ‌న్ చెప్పుకున్నారు.

అనంతరం ప్రజలను ఉద్దేశించి జ‌గ‌న్ మాట్లాడుతూ... తాను సీఎం అయ్యాక ప్రతి ల‌బ్దిదారుకి నెల‌కు వెయ్యి రూపాయ‌ల పింఛ‌న్‌ను కాకుండా నెల‌కు రెండు వేల రూపాయ‌లు ఇస్తానని చెప్పారు. చంద్ర‌బాబు నాయుడు సీఎం అయ్యాక ఆప్కోను నిర్వీర్యం చేశారని అన్నారు. మ‌న‌సున్న నాయ‌కుడు వైఎస్సార్ మాత్ర‌మేన‌ని జ‌నాలు అనుకుంటున్నార‌ని, ఆయ‌న పాల‌న‌ను మ‌ళ్లీ తీసుకొస్తాన‌ని అన్నారు. పేద‌లు ప‌నులకు పోతేనే వారికి ఆ రోజు క‌డుపు నిండుతుంద‌ని చెప్పారు.

చంద్ర‌బాబు నాయుడి పాల‌న‌లో ప‌నులు కూడా దొర‌క‌క వారు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారని అన్నారు. పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టిస్తార‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్ప‌టికీ త‌న మాట‌ను నిల‌బెట్టుకోలేద‌ని జగన్ అన్నారు. తాను మాత్రం పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు రుణం ఇచ్చేందుకు చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. చంద్రబాబు మాటలకు బడ్జెట్ లో కేటాయింపులకు ఏ మాత్రం పోలిక ఉండదని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more