ys jagan mohan reddy says chandrababu naidu showing difference among all districts | ap capital city amaravathi

Ys jagan mohan reddy comments on chandrababu naidu

ys jagan mohan reddy, chandrababu naidu, ap capital city amaravathi, hyderabad city updates, ap districts, srisailam dam

ys jagan mohan reddy comments on chandrababu naidu : ys jagan mohan reddy says chandrababu naidu showing difference among all districts.

బాబు మోసం చేస్తున్నారు : జగన్

Posted: 11/03/2015 06:44 PM IST
Ys jagan mohan reddy comments on chandrababu naidu

వైకాపాధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏపీ సీఎం నారా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కేవలం రాజధాని అమరావతి మీదే దృష్టి సారించిన బాబు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్యాయం చేస్తున్నారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలను బాబు ఒకేలా చూడటం లేదని, కేవలం కొన్నింటికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ ఇతరుల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధి అనేది అన్ని జిల్లాలకు విస్తరించాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కడపలోని సింహాద్రిపురం మండలంలో వున్న పైడిపాలెంట ప్రాజెక్టును సందర్శించిన జగన్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాబుపై విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి  మొత్తాన్ని కేంద్రీకృతం చేయడం కారణంగానే ఉద్యమాలు జరిగాయని, అటువంటి సంఘటనలు నవ్యాంధ్ర రాష్ట్రంలో జరగకుండా ఉండేలా చూడాలన్నారు. అందుకోసం రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచించారు. అంతేగానీ తాము ఏమాత్రం రాజధానికి వ్యతిరేకం కాదని జగన్ స్పష్టం చేశారు. కరువు మండలాల ప్రకటనలో చంద్రబాబు పక్షపాత ధోరణి స్పష్టంగా కన్పించిందని జగన్ ఆరోపించారు. పులివెందుల నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక్క మండలాన్నే కరువు మండలంగా ప్రకటించారన్నారు. ఇంకా శ్రీశైలం నుంచి కిందికి నీరు విడుదల చేయడం, పద్మావతి మెడికల్ కళాశాల సీట్లు మొదలైన విషయాలపై జగన్ మాట్లాడారు. బాబు ధోరణి సరిగ్గా లేదని, ఆయన అభివృద్ధి విధానం కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితంగా వుందని అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan mohan reddy  chandrababu naidu  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more