undavalli arun kumar contoversial comments on chandrababu naidu over amarvati capital city | pattiseema project controversy

Undavalli arun kumar contoversial comments on chandrababu naidu

undavalli arun kumar, chandrababu naidu, amaravati capital city, pattiseema project, ys jagan mohan reddy

undavalli arun kumar contoversial comments on chandrababu naidu : undavalli arun kumar contoversial comments on chandrababu naidu over amarvati capital city.

‘అమరావతి’.. బాబు కోట : ఉండవల్లి

Posted: 11/05/2015 05:40 PM IST
Undavalli arun kumar contoversial comments on chandrababu naidu

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని ‘అమరావతి’పై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. నిన్నటిదాకా ఈ విషయమై జగన్ నానారకాలుగా వ్యాఖ్యానించారు. తన సొంత స్వలాభాల కోసమే బాబు అమరావతిని గుంటూరులో నిర్మిస్తున్నారని, డబ్బున్న వ్యక్తుల కోసమే ఆ నగరాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ, ఇంకా పలు విధాలుగా జగన్ విమర్శలు చేశారు. ఇప్పుడు అదే తరహాలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘ఏపీ రాజధాని బాబు కోట’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

గురువారం (05-11-2015) ఉదయం పట్టిసీమ ప్రాజెక్టు జీవో కాపీలను పరిశీలించిన ఉండవల్లి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో అతిపెద్ద అవినీతి బాగోతం దాగివుందంటూ నిప్పులు చెరిగారు. రిజర్వాయర్ లేకుండా 80 టీఎంసీల నీటిని తరలించి ఎక్కడ నిల్వచేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ఎవరికీ తెలియకుండా రూ.490 కోట్లను స్వాహా చేశారని, ఈ విషయమై తాను లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలోనే బాబుపై విమర్శలు గుప్పిస్తూ.. ఏపీ రాజధాని నగరం అమరావతి చంద్రబాబు తన సొంత వాడకానికి కట్టుకుంటున్న కోట అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. అమరావతి నిర్మాణంలో ప్రజలకు భాగస్వామ్యం లేదని వ్యాఖ్యానించిన ఆయన.. ప్రజలకు నిజం తెలిసే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : undavalli arun kumar  chandrababu naidu  amaravati capital city  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more