* పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.
* ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై అనుమానాలు వద్దని, ఎవరేంటో తెలియాలనే మరోసారి అఖిలపక్షం ఏర్పాటు చేయడం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
* ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు కేంద్రం అఖిలపక్షాన్ని వేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ అంశంపై కేంద్రం నుంచి మరింత స్పష్టత వచ్చాకే పార్టీ తరపున ఢిల్లీకి వెళ్లేది ఎవరనేది ఖరారు అవుతుందని తెలిపారు.
* ఈ అవకాశాన్ని అన్ని పార్టీలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అయితే అఖిలపక్షంపై ప్రజలను మభ్యపెట్టొద్దని బొత్స విజ్ఞప్తి చేశారు.
* సమస్యల పరిష్కారం కోసమే కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందన్నారు.
* రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాలని బొత్స పేర్కొన్నారు.
* పార్టీలో ఉంటూ జేసీ దివాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ను నష్టపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఆయన అన్నారు.
* కాంగ్రెస్ను వీడేవారు వెళ్లిపోవచ్చని బొత్స వ్యాఖ్యానించారు. అయితే పార్టీని వీడి వెళ్లిపోవాలనుకున్నవారిపై చర్యలేం తీసుకుంటామని ఆయన అన్నారు.
* అఖిలపక్ష సమావేశం వల్ల మంచి జరుగుతుందని సీమాంధ్ర నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా అనుకుంటున్నట్లు బొత్స తెలిపారు.
* సిపిఎం మినహా అన్ని పార్టీలు రాష్ట్రాన్ని విభజించాలనే చెప్పాయని ఆయన అన్నారు.
* రాష్ట్రాన్ని విభజించాలని తెలుగుదేశం పార్టీ అన్ని అఖిల పక్ష సమావేశాల్లోనూ చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
* రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పిందని, కేంద్రం తండ్రి పాత్ర పోషించాలని అంటున్న జగన్‌కు ఆ రోజు సమైక్యం గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు.
* కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నందున పార్టీలు రాజకీయ చేయడం మానేసి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
* అపోహలను, అనుమానాలను పక్కకు పెట్టి పార్టీలు వాస్తవాలకు దగ్గరగా వెళ్లాలని బొత్స సూచించారు.
* ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించవద్దని ఆయన సలహా ఇచ్చారు.
* అధికారం కోసం రాజకీయం చేయడం మానేసి సామరస్యపూర్వక వాతావరణంలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు.
* ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టబోరని బొత్స చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more