Swami vevekananda

swami vivekananda, annamacharyulu, venkateswara swami

swami vivekananda quote

స్వామి వివేకానంద

Posted: 03/07/2013 05:38 PM IST
Swami vevekananda

vivekananda

ఆత్మ విశ్వాసమే లేని మనిషికి పరమాత్మ మీద భక్తి విశ్వాసాలు ఎలా ఉంటాయి? – స్వామి వివేకానంద

కనిపించని దేవుడిని నమ్మటం కష్టమే.  తన మీద తనకే నమ్మకం లేని మనిషికి అది మరీ అసాధ్యమే అవుతుంది.  ఆత్మవిశ్వాసం ఉంటేనే ఆత్మధైర్యం ఉంటుంది.  ఆత్మధైర్యం ఉన్నవాళ్ళకే చేసే పనులలో సామర్ధ్యం, చేసిన తర్వాత ఆత్మతృప్తి కలగటం ఉంటాయి.  అలాంటి మౌలికమైన ఆత్మవిశ్వాసమే లేనప్పుడు, మనిషి తనమీద తానే నమ్మకాన్ని కోల్పోయి ఉన్నప్పు కనిపించని దేవుడిని ఎలా నమ్మగలడు? 

దేవుడు లేడు అంటే అర్థం నేను లేను అనే.  ప్రతి మనిషిలో ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో అణువణువునా సృష్టంతా నిండి ఉన్న చైతన్యమే బ్రహ్మమంటే.  సర్వవ్యాపకుడూ, సర్వశక్తివంతుడూ, సర్వఙుడూ, సర్వంలోనూ అంతర్లీనమై అంతర్వాహినిలా ఉన్న శుద్ధచైతన్యాన్ని లేదు అని అనటమంటే నేను లేను అని అనుకోవటమే అవుతుంది.  ఆ దివ్య చైతన్యమే మనలను నడిపించేది.  చైతన్యమున్నంత సేపూ శివమే కానీ ఆ చైతన్యం వీడిపోగానే శవం అవుతాం.  ఈ మాటనే వ్యతిరేక దిశలో చెప్పారు స్వాని వివేకానంద.

దేవుడు లేడు అంటే నేను లేను అని కాకుండా, నేను అనే దానిమీద నమ్మకం లేకపోతే ఇక ఆ నేను లోపల ఉన్న చైతన్యాన్ని, బ్రహ్మను అంటే పరమాత్మను నమ్మటం ఎలా కుదురుతుంది అని అంటారాయన.  ఉన్నదీ లేదూ అన్నది మనలోనే ఉంటుంది.  మనమెలా అనుకుంటే అలా.  అందుకే ఎంతవారు ఎంత అనుకుంటే అంతే నీవు అని అన్మమయ్య పాటలో స్తుతిస్తాడు.  వేంకటేశ్వరుడనుకుంటే వేంకటేశ్వరుడు, బాలాజీ కాదు శక్తి స్వరూపం బాలా త్రిపురసుందరీ దేవి అంటే ఆయన అలాగే పలుకుతాడు.  అదే భగవంతుడిని వైష్ణవులు, శాక్తేయులు, శైవులు ఎవరైనా వారికిష్టమైన రూపంలో చూసుకుంటూ ఇష్టమైన పేరుతో పిలుచుకోవచ్చు.  అలాగే, మనం కోరుకున్నట్టుగా ఉండే భగవంతుడు 'లేడు' అని నమ్మేవాళ్లకి నిజంగానే ఆయన లేడు- ఉండడు కూడా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Swamy vevakananda

    స్వామి వివేకానంద

    Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more

  • Gandhi word of wisdom

    May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more

  • Rabindranath tagore quotes

    May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన... Read more

  • Adi shankaracharya quotes

    May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more

  • Swamy vivekananda quotes

    Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more