Mahatma gandhi quotes

mahatma gandhi, shatakam, quotes, words of wisdom

mahatma gandhi quotes

గాంధీసూక్తులు

Posted: 02/23/2013 01:49 PM IST
Mahatma gandhi quotes

మనోవాక్కాయ కర్మలను ఒకటిగా చేసి, మీ ఆలోచనలను నిర్మలంగా చేసుకునే ప్రయత్నం చేసి చూడండి ఫలితం ఎంత బావుంటుందో – మహాత్మా గాంధీ.

మనం చేసే పనులు (యాక్టివిటీస్) స్థూలంగా మూడు రకాలుగా ఉంటాయి. 

1.    మనసులో ఆలోచన రూపంలో
2.    నోటి ద్వారా వాక్కు రూపంలో
3.    భౌతిక రూపంలో ఆ పనిని చెయ్యటం.

సామాన్యంగా మనుషుల్లో చాలా మంది మనసులో అనుకునేది ఒకటి, పైకి చెప్పేది మరొకటి ఉంటుంది.  అదే లౌక్యం- అంటే లౌకిక వ్యవహారం- లోకంలో చెయ్యవలసిన తీరు అని అనుకుంటారు.  మన శరీర విధానంలో నిజానికి ఈ రెండిటికీ చాలా దగ్గర సంబంధం ఉంది.  మనం ఏదైతే అంటామో మనసులో అదే ముద్ర పడుతుంది.  కానీ ఏదైనా ఆలోచించి మనసులో పెట్టుకున్నదానికి భిన్నంగా మాటల ద్వారా బయటకు తెలియజేసినప్పుడు మనసు సందిగ్ధంలో పడుతుంది.   ఉదాహరణకు, ఒక మిఠాయి చూసి ఇష్టపడ్డామనుకోండి.  ఆ విషయాన్ని మనసు గుర్తు పెట్టుకుంటుంది.  మరోసారి ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ మిఠాయి తింటే బావుంటుందని గుర్తు చేస్తుంది.  కానీ ఎవరైనా  ఆ మిఠాయిని తినమని మీకు అందించినప్పుడు మర్యాద కోసమో మరేదైనా కారణం వల్లనో వద్దనో, ఇష్టం లేదనో, లేక తినగూడదనో అన్నారనుకోండి మనసులో ద్వంద్వ భావన మొదలౌతుంది.  అది మీకు ఇష్టమా కాదా అన్నది మీ మనసుకి సరిగ్గా అర్థం కాదు. 

అలాగే, నోటితో చెప్పేది ఒకటి చేసేది మరొకటైనప్పుడు కూడా శరీర విధానంలో సందిగ్ధత చోటుచేసుకుంటుంది.  అందుకే, మనం ఏమి ఆలోచిస్తామో అదే పైకి చెప్పి, చెయ్యటం కూడా అదే విధంగా చేసినట్లయితే మన శరీర విధానం సజావుగా నడుస్తుంది.  అదే మనోవాక్కాయ కర్మణా అంటే.  దాని వలన మనిషికి సహజంగా ఉండే సంకల్పశక్తి పెరుగుతుంది.  అందుకే ఆ నియమాన్ని పాటించే మహాత్ములంతా ఎప్పుడూ చీకూ చింతా లేకుండా, మనసులో వ్యధలు లేకుండా ఉంటారు. 

మహాత్మా గాంధీ సూచించిన ఈ సూత్రాన్ని పాటించటమే సులభం.  కానీ సామాన్యంగా అధిక శాతం మనుషులు దీనికి వ్యతిరేకంగా నడుచుకుని తమకు తామే అనవసరంగా శిక్ష విధించుకుంటారు.  దానికి లౌక్యమని ఒక పేరు పెట్టుకుని వ్యవహారం చక్కబెట్టటానికి అదే సరైన మార్గమని అనుకుంటారు.

ఒక నియమంలా పెట్టుకుని గాంధీగారు సూచించిన ఈ సులభమైన మార్గాన్ని- మనసులో అనుకునేదే పైకి చెప్పటం, ఆ చెప్పిందే చెయ్యటం- అవలంబించి చూడండి, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Swamy vevakananda

    స్వామి వివేకానంద

    Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more

  • Gandhi word of wisdom

    May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more

  • Rabindranath tagore quotes

    May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన... Read more

  • Adi shankaracharya quotes

    May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more

  • Swamy vivekananda quotes

    Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more