సహజంగా ఎవరికైన అద్రుష్టం కలిసి వస్తే.. నక్క తొక తొక్కినట్లు ఉందని ఊతపదంగా వాడతారు. అయితే.. ఈ సుందరి మాత్రం ఏకంగా నక్కనే తొక్కినట్లు ఉందని ఆమె అభిమానులు ఆనందంతో అంటున్నారు. ఈ భామకు టాలీవుడ్, కోలీవుడ్ లో అవకాశలు .. అరుదుగా రావటంతో.. బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ బాబులకు .. నడుము సుందరి బాగా నచ్చటంతో.. యంగ్ హీరోలు, ముదురుహీరోలు.. పిలిచి మరీ ఈ నడుము సుందరితో రొమాన్స్ పెట్టుకుంటున్నారు. ఇంతకీ నక్కను తొక్కిన ఇల్లీ బెబీ ఎవరు అనుకుంటున్నారు. బాలీవుడ్ లో పాగా వేసి బర్ఫీ చిత్రం తో గుర్తింపు తెచ్చుకున్న గోవా బ్యూటి ఇలియానా బాలీవుడ్ లో బండి నడిపిస్తుంది. ఈ మధ్య షాహిద్ కపూర్ తో చేసిన ఫటా పోస్టర్ నిక్లా హీరో చిత్రంలో గ్లామర్ పరంగా మెప్పించింది.
బెంగాలీ డైరెక్టర్ రణబీర్ కపూర్ , ప్రియాంక చోప్రా, ఇలియానా లీడ్ రోల్స్ లో చేసిన బర్ఫి చిత్రం లో ఇలియానా చేసిన ట్రెడిషనల్ వుమెన్ రోల్ గ్లామర్ గా తనకు గుర్తింపు తీసుకు రాలేదు. దాంతో ఆ చిత్రం తరువాత షాహిద్ కపూర్ తో చేసిన సినిమాతో హండ్రెట్ పర్సెంట్ గ్లామర్ మీదే ఫోకస్ చేసింది. తను ఊహించిన విధంగానే ఈ చిత్రంతో ఇలి బేబి గ్లామర్ తో కూడా బాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించగలనని నిరూపించుకుంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ సరసన హ్యాపి ఎండింగ్ ..వరుణ్ ధావన్ తో మై తేరా హీరో సినిమాలు చేస్తే కెరీర్ పరంగా నాట్ బ్యాడ్ అనే విధంగా ఉంది.
అయితే తాజా సమచారం ఏమిటంటే.. ఈ గోవా కోవా కు బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ లో ఒకడైన సల్మాన్ ఖాన్ సరసన నటించే చాన్స్ వచ్చింది. బాలీవుడ్ లో కుటుంబ కథా చిత్రాలు చేయడంలో మంచి పేరున్న డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా 8 సంవత్పరాల గ్యాప్ తరువాత మళ్లీ ఒక సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్ ను కరీనా కపూర్ ను అనుకున్నారు. కానీ ఎందుకో కరీనా కపూర్ చివరి నిముషంలో డ్రాప్ అవడంతో.. కరీనా ప్లేస్ లో ఇలియానాను తీసుకున్నాట్లు బాలీవుడ్ సమాచారం .
ఈ ఆఫర్ తో ఇల్లీ బేబి ఉబ్బి తబ్బిబ్బ అవుతుంది.సల్మాన్ సరసన ఈ ఆఫర్ రావడం గౌరవం అంటు సంతోషంగా ఉంది.సల్మాన్, సూరజ్ కాంబినేషన్ లో గతంలో మైనే ప్యార్ కియా.. హమ్ ఆప్ కే హై కౌన్..హమ్ సాథ్ సాథ్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు కూడా ఘన విజయం సాధించాయి. మొత్తం మీద కెరీరర్ కొడగడుతున్న సమయంలో ఇలియానా కు ఈ ఆఫర్ రావడం అంటే..నిజంగా నక్కను తొక్కినట్లుగా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more