నటుడు నందమూరి ఎన్టీఆర్ పై రాజకీయాలు వేగంగా నడుస్తున్నాయి. ఇప్పుడు రెండు పార్టీల నాయకుల ద్రుష్టి జూనియర్ ఎన్టీఆర్ మీద పడింది. 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఏపార్టీకి మద్దతు తెలుపుతాడో. ఏ పార్టీకి హ్యాండ్ ఇస్తాడో అనే దాని పై రాజకీయ నాయకుల మద్య హాట్ టాపిక్ నడుస్తుంది. ఈవిషయం పై సైకిల్ గుర్తు నాయుకులు, ఫ్యాన్ గుర్తు నాయకులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సైకిల్ గుర్తు నాయకులు ఎన్టీఆర్ 2014ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే మద్దతు తెలుపుతాడని చెబుతున్నారు. అదే స్థాయిలో ఫ్యాన్ గుర్తు నాయకులు ఎన్టీఆర్ పై ఆశలు పెట్టుకున్నారు.
ఈ రెండు పార్టీల నాయకుల మాటలను బట్టి చూస్తే.. ఫ్యాన్ గుర్తుకే ..ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే ఫ్యాన్ గుర్తుకి ..ఎన్టీఆర్ మామ (పిల్లనిచ్చిన) రాజకీయంగా చేరినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఆయనకి ఎంపీ టిక్కెట్ కూడా ఫ్యాన్ గుర్తు అధినేత కేటాయించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి పుకార్ల పై జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ..టిడిపి నాయకులు, నందమూరి అభిమానులు సందిగ్దంలో పడ్డారు.
అయితే ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయం వెనుక మాత్రం ఆయన భార్య లక్ష్మిప్రణిత హస్తం ఉంటుందని నందమూరి అభిమానులు అంటున్నారు. రీసెంట్ గా జరిగిన ఒక ఆడియో ఫంక్షన వేదిక పై ప్రముఖ దర్శకుడు కూడా ఎన్టీఆర్ మార్పు వెనుక లక్ష్మీప్రణిత హస్తం ఉందని చెప్పటం తెలిసిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా జగన్ పార్టీకి ప్రచారం చేయటం వెనుక ఆమె హస్తం ఉంటుందని నందమూరి అభిమానులు అంటున్నారు.
అయితే ఎన్టీఆర్ తీసుకొనే నిర్ణయం కోసం తెలుగు తమ్మళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. అంటే గతంలో ఎన్టీఆర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ నా కట్టే కాలే వరకు .. తాతా పార్టీకి ద్రోహం చేయనని అన్నడని, తాత సెంటిమెంట్ ను గౌరవించి..ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాడని కొండంత ఆశతో టిడిపి నాయకులు ఎదురుచూస్తున్నారు. చివరకు ఎన్టీఆర్ ఎటు వైపు మొగ్గు చూపుతారో తెలుసుకోవాలంటే.. రాబోయే ఎన్నికల వరకు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more