ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి పై వేటు పడిన విషయం తెలిసిందే. కేంద్రం దెబ్బ రేణుకా చౌదరి పై పడిన వెంటనే.. మొట్ట మొదటిగా ఆనందపడింది.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మొదటి నుంచి రేణుక చౌదరి పై మండిపడుతున్నారు. గతంలో ఒక్కసారి తెలంగాణ కాంగ్రెస్ మంత్రలు సమావేశానికి వెళ్లి రేణుక పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఆమె మౌనం పాటించి, సిగ్గుతో బయటకు వచ్చినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సడన్ గా.. రేణుకా చౌదరిని ఎందుకు వేటు వేసిందో ఎవరికి అర్థం కావటంలేదు గానీ .. దీని వెనుక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నరనే విషయం ఈరోజు బయటపడింది. పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ వంటి నేతలు బహిరంగంగానే ఎద్దేవా చేస్తున్నారు. ఎంపీలు ఆమెపై ఆరోపణలు గుప్పించడానికి కారణాలు చాలానేవున్నాయని చర్చించుకుంటున్నారు.
తెలంగాణా పై ఇప్పటి వరకు . ప్రత్యేకరాష్ర్టం ఇవ్వాలని హైకమాండ్ దగ్గర రేణుకా డిమాండ్ చేసిన సందర్భాలు అస్సలు లేవని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఖమ్మం ఇష్యూలో వేలు పెడితే సహించేది లేదని మీడియాతో చెప్పడం.. తెలంగాణ నేతలకు ఆగ్రహం తెప్పించింది. చివరకు ఏఐసీసీ పదవి నుంచి ఆమెని తొలగించడంతో ప్రత్యర్థులు చాలా ఆనందంగా దూం దాం చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.
అయితే ఈ విషయం ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తెలియటంతో.. ఆగ్రహంతో ఊగిపోతు.. తెలంగాన కాంగ్రెస్ నేతలకు, కాంగ్రెస్ పార్టీకి మరో రెండురోజుల్లో నా తడాఖా ఏంటో చూపిస్తానంటూ తన అనుచరుల దగ్గర ఈ రేణుకా చౌదరి మండిపడినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ వేటు వేసిన తరువాత రేణుకా చౌదరి ఏం తడాఖా చూపిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే రేణుకా రెండు రోజుల్లో ఏం చూపిస్తుందో, ఏం చెబుతుందో, ఎవరిపై ఫైర్ బ్రాండ్ పేలుతుందోనని ఆశగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులారా జాగ్రత్త..రెండో రోజుల్లో ఖమ్మం పైర్ బ్రాండ్ పేలుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more