పెద్ద పెద్ద స్టార్ నుండి చిన్నా చితకా సినిమా సెలబ్రెటీల వరకు అందరు తమకు పాపులారిటీని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల పైనే ఆధారపడుతున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ వగైరా లాంటి వాటిలో అకౌంట్లు ఓపెన్ చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారో అందులో పోస్ట్ చేసి అందరితో షేర్ చేసుకుంటున్నారు.
వీరి అకౌంట్లకు లక్షల కొద్ది ఫాలోవర్స్, వేలకొద్ది లైక్స్ వచ్చి పడుతున్నాయి. స్టార్ సెలబ్రెటీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే లైక్స్ మీద లైక్స్ పడుతున్నాయి. కానీ ఇండస్ట్రీలో ఉన్న చిన్న సెలబ్రెటీ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ కుప్పల కొద్ది లైక్స్ వచ్చి పడుతుండటంతో వీటిని చూసిన సినిమా జనాలకు వీళ్ళకు ఇంత ఫాలోయింగ్ ఎక్కడిదని ఆరా తీయగా ఫేస్ బుక్ లైక్స్ కి సంబంధించి కొన్ని మతిపోయే నిజాలు తెలిశాయట. ఈ లైక్స్ వెనక వేల వ్యాపారమే జరుగుతుందని తేలడంతో అందరు గుడ్లు తేలేశారట.
కొంత మంది సినీ స్టార్స్ మాత్రం ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని తమ పేజీలకు భారీగా లైక్స్ పెరిగేలా చేసుకుంటున్నారని, దేశంలో ఫేస్బుక్ నెట్వర్కింగ్ భారీగా పెరిగిన నేపథ్యంలో తమ పబ్లిసిటీ పెంచుకోవడంలో భాగంగానే ఒక్కో లైక్ కి యాభై పైసలు చెల్లించి మరీ తమ ఫేస్బుక్ పేజీలకు లైకులు పెంచుకుంటున్నారని, ఇందుకోసం ప్రత్చేకంగా కొన్ని సంస్థలు పని చేస్తున్నాయట. సదరు స్టార్ల ఫేస్ బుక్ పేజీలను వారే మెయింటేన్ చేస్తూ లైకుల సంఖ్య పెరిగేలా ఇంట్రస్టింగ్ పోస్టింగులు చేయడంతో పాటు, ఒక పేజీ నుంచి మరొక పేజీకి లైక్స్ పెరిగేలా రికమండ్ చేయడం లాంటివి చేస్తున్నట్లు తెసిందట.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more