తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలు, వరద బాధితులను పరామర్శించిన ఆయన ఒక్కసారిగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకొని విమర్శల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఎల్‌అండ్‌టి కంపెని వద్ద వందల కోట్ల రూపాయల లంచం తీసుకొని వారసత్వ సంపదను పోగెట్టే విధంగా మెట్రో రైల్ మార్గానికి నిధులు కేటాయించారన్నారు. ఈ పనులను తక్షణమే ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెట్రో రైల్ పనులను రివ్యూ నిర్వహించి అవినీతి పరులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బెంగళూరు వంటి నగరరాల లోనే కాకతీయులు కట్టిన అసెంబ్లీ, సుల్తాన్ బజార్, మొజ్జా మార్కెట్ వద్ద కనపడకుండా చేశారన్నారు. నగరంలో జరుగుతున్న మెట్రో పనుల పై తీవ్రంగా కేసిఆర్ మండిపాడ్డారు. అంతేకాకుండా మెట్రో పనుల్లో అవినీతి జరిగిందని, అంటూ మెట్రోపనులను తక్షణమే ఆపివేయాలని హుకుం జారీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం అయ్యే ప్రశ్నే లేదని గులాబీ బాస్ చెప్పటం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ పేరుతో వెయ్యి మందిని కాంగ్రెస్ పార్టీ పొట్టనబెట్టుకుందని కేసిఆర్ నూతన విమర్శ చేసి.. ఢిల్లీ నేతలకు షాకిచ్చారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేస్తామంటూ గతంలో ప్రకటించిన ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మాటమార్చారు. ఇప్పటివరకూ పార్టీ అంతర్గత సమావేశాల్లో, పరోక్షంగా ఆ నిర్ణయాన్ని పలుసార్లు వెల్లడించిన కేసీఆర్ ఈ విషయంపై మరింత స్పష్టతనిచ్చారు. ఆయన తనకు రాజకీయ జన్మనిచ్చిన మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో వర్షబాధిత రైతులను కలుసుకుని, పంటలను పరిశీలించారు. కేసీఆర్ విలీనమనే ఆలోచనే పెట్టుకోవద్దంటూ కాంగ్రెస్ నేతలకు అర్థమయ్యేలా చెప్పారు. విలీనం అంటే ఆషామాషీ కాదంటూ తేల్చేశారు. “మేము టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తాం తెలంగాణ ఇవ్వండి అన్నప్పుడే ఇచ్చి వుంటే 400 మంది తెలంగాణ విద్యార్థులు బ్రతికేవారు. కాంగ్రెస్ ఉట్టిగానే తెలంగాణ ఇవ్వలేదు. వెయ్యి మందిని పొట్టన పెట్టుకున్నాకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది’ అంటూ ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో తాము అడిగినప్పుడు తెలంగాణ ఇచ్చి ఉంటే విలీనం చేసేవారమని, ఇంతదూరం వచ్చాక ఇప్పుడు విలీనమంటే కుదరదంటూ ఆయన స్పష్టం చేశారు.
విలీనానికి రాజకీయ పరిస్థితులు కూడా కలిసి రావాలంటూ ఆయన తేల్చేశారు. దీంతో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో విలీనం సాధ్యం కాదంటూ చెప్పకనే చెప్పారు. కేసీఆర్ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకున్నాక ఇంతవరకు ఇంత స్పష్టంగా విలీనం అంశాన్ని బహిర్గతంగా ఎప్పుడు వెల్లడించలేదు. తొలిసారిగా దీనిపై మీడియా ముందు స్పందించారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనమవుతుందంటూ భావిస్తూ వస్తున్న కాంగ్రెస్ నాయకుల్లో కేసీఆర్ వ్యాఖ్యలు గుబులు రేపుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర విభజన అంశంలో దాదాపు సగం ప్రక్రియ పూర్తైయ్యాక కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడంలేదు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఇప్పటికే అధిష్టానం పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలపై అధిష్టానం పెద్దలు కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం.
విభజన నిర్ణయానికి ముందే కేసీఆర్‌ను పిలిపించి మాట్లాడుకుని ఒక ఒప్పందం చేసుకుంటే బాగుండేదని పలువురు తెలంగాణ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌పై ఎటువంటి ఒత్తిడి తేలేకుండా ఉన్నామంటూ అధిష్టానం పెద్దలు కొందరు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇటీవల పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తెలంగాణ ప్రజలు తెరాస వైపే మొగ్గు చూపుతున్నారని, రాష్ట్రం ఏర్పాటయ్యాక పునర్ నిర్మాణంలో తెరాస కీలక పాత్ర పోషించాలని ప్రజలు కోరుతున్నట్లుగా ఫలితాలు రావడంతో తెరాస అధినేత కేసీఆర్ కూడా విలీనంపై వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న పలువురు నాయకులు కూడా విలీనం ప్రచారంపై కేసీఆర్‌ను గట్టిగానే నిలదీసినట్లు తెలుస్తోంది. విలీనమంటూ జరిగితే తమ రాజకీయ భవిష్యత్ ఏమిటని ప్రశ్నించడంతో కేసీఆర్ సైతం ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. కొందరు నాయకులయితే విలీనమంటూ జరిగితే కేసిఆర్ కుటుంబ సభ్యులు, కొందరు నాయకులకు మాత్రమే భవిష్యత్ ఉంటుందని 12 ఏళ్ళుగా జెండా భుజాన వేసుకుని అన్నింటికీ ముందుండి అనేక కేసులను ఎదుర్కొంటున్న తాము భవిష్యత్‌లో ఏమి చేయాలని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
పార్టీలోని సీనియర్ నాయకులతో, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమ సంఘాల నాయకులు కొందరితో కేసీఆర్ ఈ విషయంపై చర్చించిన సందర్భంలో కూడా విలీనం ఆలోచనను విరమించుకోవాలని కేసీఆర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పునరాలోచనలో పడిన కేసీఆర్ దాదాపుగా విలీనం అంశాన్ని పక్కకుపెట్టినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more