ఎక్కువ సినిమాల్లో హోమ్లీగా కనిపిస్తే ఎక్కడ యూత్‌కి దూరమవుతానో అనుకుందో ఏమో...కెరళ కుట్టి నయనతార ‘ఆరంభం’లో అందాలను ఆరబోసింది. బాలకృష్ణతో వరుసగా నటించిన సింహా, శ్రీరామరాజ్యం చిత్రాల్లో హోమ్లీగా కనిపించింది. ఇలా రెండు తెలుగు చిత్రాల్లో వరుసగా ఆరడుగుల చీరలో కనిపించిన ఈ భామ... ఇక నుంచి కాస్తంత గ్లామర్ ఉన్న పాత్రల్లో నటించాలని అనుకుందో ఏమో... ఇటీవల తమిళంలో విడుదలైన అజిత్ ‘ఆరంభం’ సినిమాలో లెగ్గింగ్ లేకుండా యూత్‌కి కనువిందు చేసింది.
ప్రభుదేవాతో ప్రేమాయణం ముగిశాక తెలుగు, తమిళ భాషల్లో సినిమాల జోరు పెంచింది నయనతార. ఈ క్రమంలో నటుడు ఆర్యతో చనువుగా వుంటోందని గత కొంత కాలంగా తమిళ చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై నయనతార వివరణ ఇచ్చింది. నయనతార ప్రస్తుతం నేను ఒంటరిగానే వుంటున్నాను. ఎవరినీ ప్రేమించడం లేదు.
అసలు ప్రేమ గురించే ఆలోచించడం లేదు’ అని తెలిపింది. ఆర్యతో ప్రేమాయణం గురించి వస్తోన్న వార్తలపై స్పందిస్తూ ‘ఇటీవల ఆర్యతో కలిసి నటించిన ‘రాజు రాణి’లో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదరడంతో మా మధ్య ఏదో వుందని అంతా ప్రచారం చేస్తున్నారు. అతను నాకు మంచి మిత్రుడు అంతే. అంతకన్నా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధంలేదు. అతనితో నా స్నేహాన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తా.
నేను కెరీర్ ప్రారంభించి ఈ ఏడాదితో పదేళ్లు పూర్తవుతోంది. ఈ పదేళ్లలో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ నాపై ప్రేమను చూపించారు. వారందరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పదేళ్ల ప్రయాణంలో చాలా మంది మనసున్న వాళ్లని కలిశాను. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా మంచి సినిమాల్లో నటించానన్న సంతృప్తి మిగిలింది’ అని తెలిపింది.
అయితే నయనలో కనిపించిన మార్పు.
ఇటీవల నయన నూతన అందాలతో యూత్ ను కనువిందు చేస్తుంది. ‘ఆరంభం’ సినిమాలో లెగ్గింగ్ లేకుండా . అదికూడా తడిసిన తెల్లని షర్టు మాత్రమే ధరించి పిక్కలు కనిపించేలా... టాన్సపరెన్సీ దుస్తుల్లో మెరిసింది ఈ అమ్మడు. ఇక నుంచి ఇలాంటి గ్లామర్ ఉన్న పాత్రల్లోనే నటిస్తానని ఎవరూ అడగకుండానే ఇలా సంకేతాలు ఇచ్చిందా? అని పరిశ్రమ వర్గాలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇన్నాళ్ళు నయన అందాలను చూడలేక పోయిన వారికి ఇక నుంచి రాబోవు సినిమాల్లో నయన నూతన అందాలు మత్తెక్కించనున్నాయని అర్థమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more