అసలు ఆంధ్రానే ఎందుకు చీల్చుతున్నారు? గతంలో.. మద్రాస్ నుండి ఆంద్రప్రదేశ్ ను వీడదీశారు. ఇప్పుడు తెలంగాణ నుండి ఆంద్రాను వీడదీస్తున్నారు. తెలుగుజాతినే ఎందుకు వీడదీస్తున్నారు. తెలుగుజాతి పై కాంగ్రెస్ కక్ష ఏమిటి? తెలుగు జాతిపై కాంగ్రెస్ పార్టీ పగ తీర్చుకుంటుందా? తెలుగు గడ్డని ఎన్నిముక్కలు చేస్తారు? అసలు కాంగ్రెస్ లక్ష్యం ఏమిటి? తెలుగు వారికి కాంగ్రెస్ కష్టాలు ఎన్నాళ్లు, ఎన్నేళ్లు. యుగాలు గడిచిన తెలుగుజాతి పరిస్థితి ఎందుకు మారటం లేదు. అప్పుడు మద్రాస్ ను వదులుకున్నాం, కర్నూల్ ను విడిచిపెట్టాం.. ఇప్పడు మాత్రం హైదరాబాద్ ను వదులుకోలేం అని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. ఆంద్రాను ఎందుకు విడదీస్తున్నారు.. మహారాష్ట్రలో విదర్భను, ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు గత ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఆ రాష్ట్రాలను ఏర్పాటు చేయకుండానే కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చడంలో ఆంతర్యం ఏమిటో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రజలకు చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.
తెలుగుజాతి కోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాటం సాగిస్తానన్నారు. 36 రోజులుగా రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర ప్రాంతం అట్టుడికి పోతుంటే దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మిన్నకుండటంతోపాటు హోంమంత్రి షిండే రాష్ట్ర విభజనకు సంబంధించి 20 రోజుల్లో క్యాబినేట్‌కు నోట్‌ఫైల్ సమర్పిస్తామని చెప్పడం దారుణమన్నారు. సీమాంధ్రలో సమస్యను పరిష్కరించకుండా ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు దిగుతున్నారంటే తెలుగుజాతి పొట్టకొట్టేందుకేనని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో ఆవిర్భవించి ఇప్పటి వరకు తెలుగు జాతి ఔనత్యం కాపాడేందుకు నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. తెలుగుజాతితో పెట్టుకున్న వారెవరైనా చరిత్రహీనులవుతారన్నారు. దివంగత ముఖ్యమంత్రి టి.అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారన్నారు. అందుకు ప్రతిగా ఎన్‌టిఆర్ టీడీపీ స్థాపించి అధికారంలోకి వచ్చారన్నారు. 1984లో అన్న ఎన్‌టీ రామారావును ఇందిరాగాంధీ అన్యా యంగా సీఎం పదవి నుంచి భర్తరఫ్ చేసిన విషయంలో ఇందిరా గాంధీ మెడలను తెలుగు ప్రజలు వంచారన్నారు. తెలుగు తమ్ముళ్లంతా బొబ్బిలి పులులై తిరగబడి ఆ పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more