కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన ప్రకటనతో సీమాంధ్రలో మొదలైన సమైక్య వాదుల ఆందోళన రోజురోజుకీ పెరుగుతోంది.
ఏ పార్టీ ఏం ప్రకటించినా, ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎందరు రాజీనామాలు చేసినా, ఎవరు ఎలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చినా, కేంద్రానికి ఎవరెన్ని లేఖలు రాసినా, స్వచ్ఛందంగా రోడ్లమీదకు వచ్చిన సమైక్యాంధ్ర ఆందోళన సద్దుమణగటం లేదు సరికదా రోజురోజుకీ ఎక్కువౌతోంది.
ఆందోళనలో రాజకీయ ప్రమేయం ఉండకుండా ఉండటం కోసం నిన్న విశాఖలో కార్యాచరణి సమితి ఏర్పడింది. సమైక్యాంధ్ర కార్యకలాపాలన్నీ జెఎసి ద్వారానే చెయ్యాలని నిర్ణయం జరిగింది.
రేపు అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొననున్న ఎపి ఎన్జీవోల సంఘం ఈ రోజు గన్ పార్క్ లో సమావేశమైంది.
ఈరోజు అర్థరాత్రి నుంచి తిరుమలకు బస్ సర్వీసులను నిలిపివేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాల జెఇవో శ్రీనివాసరావు కార్మిక సంఘాలతో ఈ విషయంలో చర్చలు జరుపుతున్నారు. అయితే 13 సీమాంధ్ర జిల్లాలలో 123 ఆర్టీసీ డిపోలకు చెందిన 70 వేల మంది కార్మికులు సమ్మెలోకి దిగుతుండటంతో ఎక్కడికక్కడ రవాణా నిలిచిపోయే అవకాశం ఉంది.
నెల్లూరులో చలనచిత్ర పరిశ్రమలోని పంపిణీదారులు సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రదర్శనలు జరిపారు. నెల్లూరులో సీమాంధ్రలోని 14 విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. వారు భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకుంటున్నారు.
విశాఖపట్నంలో రైల్ రోకో కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు కానీ గుంటూరులో ఆందోళనకారులు సింహాద్రి ఎక్స్ ప్రెస్ ని అడ్డుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కేబుల్ ఆపరేటర్లు టివి ఛానెల్స్ లో వినోద ఛానెల్స్ ని రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిలిపివేయటానికి నిర్ణయించుకున్నారు.
హైద్రాబాద్ లో వాణిజ్య పన్నుల శాఖలోని ఆంధ్ర ఎన్జీవోలు 13 వ తేదీ నుండి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. రాష్ట్ర ఆదాయంలో 70 శాతం ఈ శాఖ ద్వారానే వస్తుండటం వలన ఈ సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద దెబ్బే తగులబోతోంది.
ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్ళిపోతారన్న కెసిఆర్ వ్యాఖ్యలతో భగ్గుమన్న సీమాంధ్ర ప్రజలు వాళ్ళ హక్కుల పరిరక్షణకోసం ఎవరెన్ని హామీలు ఇచ్చినా నమ్మటం లేదు. ఒక పక్క సీమాంధ్ర ప్రజలకు రక్షణ, వెనకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజీల గురించి మాట్లాడుతున్న దిగ్విజయ్ సింగ్ మరోపక్క తెలంగాణా నిర్ణయం జరిగిపోయిందని, ఆంటోనీ కమిటీ కేవలం సీమాంధ్రుల వెతలను వింటుందనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. దానితో, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసేసుకున్న తర్వాత అదే పార్టీ నియమించిన కమిటీ వలన ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం కూడా అందరిలో కలిగింది.
ప్రజా ఉద్యమాన్ని ఆపటం ఎవరి తరమూ కాదని, ఎన్నికల వరకూ పార్లమెంటుని స్థంబింపజేసి రాష్ట్ర విభజన బిల్లుని ఆపుతామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.
అంతకంతకూ ముదిరిపోతున్న సమైక్య ఆందోళనలలో అన్ని సంఘాలు, అన్ని వర్గాలు రాజకీయ ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పాల్గొనటం, రాజకీయ నాయకులకు దడపుట్టించటం విశేషం. కాంగ్రెస్ నాయకులకు రోజురోజుకీ ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగానే తయారౌతూ కనిపిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more