Konda surekha couples sensational comments on ys jaganmohan reddy

konda surekha write serious letter to ys jagan, konda surekha fire on ys jagan and vijayamma ys jagan power punch by konda surekha, konda surekha, open letter to ys jagan konda murali, ys vijayamma, telangana issue, janaki prasad, ysr congress party, resignations, 16 ysrcp mlas, konda surekha couple , breaking news, ap politics, political news, andhra news

Konda Surekha Couple Sensational Comments on YS Jaganmohan reddy, Konda Surekhas controversial Letter to Jagan, Konda Surekha Fire on YS Jagan and Vijayamma

జగన్ విశ్వరూపం చూపించిన కొండా

Posted: 07/29/2013 02:57 PM IST
Konda surekha couples sensational comments on ys jaganmohan reddy

వైఎస్ అంటే... కొండా. కొండా అంటే వైఎస్ అందరికి తెలిసిన విషయమే. వైఎస్ కుటుంబం కోసం కొండా దంపతులు పదవులు సైతం త్యాగం చేసి వారి మద్య ఉన్న కుటుంబం బంధాన్ని బలపరుచుకున్నారు. కొండా సురేఖ దంపతులు వైఎస్ కుటుంబానికి కొండంత బలం. కానీ ఇప్పుడు ఈ బలమే వైఎస్ కుటుంబం పై పగపట్టింది. నిన్నటి వరకు వైఎస్ నామస్మరణ చేసిన కొండా దంపతులు నేడు ఘాటైన విమర్శలు చేస్తేస్థాయికి ఎదిగిపోయారు. కొండా సురేఖ ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి విశ్వరూపం చూపించింది. కొండా పవర్ ఎఫెక్ట్ వైఎస్ విజయమ్మను తాకింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారు. జగన్ పై పార్టీ పై లేఖలో తీవ్ర విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ కకు మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ అజెండా అని కొండా దంపతులు అన్నట్లు సమాచారం.

 

అంతేకాకుండా వైకాపా ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అని కొండా ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ చంచల్ గూడ జైలు నుంచే సలహాలు ఇస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. జగన్ కోసం మేము పదవులను కోల్పోయామని , పార్టీకి ఓ ఎమ్మెల్సీ అవకాశం వస్తే తన భర్త మురళీ కాకుండా ఇతరులకు ఇచ్చారని కొండా ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తో ఉన్నందుకు మేము ఆర్థికంగా చాలా నష్టపోయం, అందుకాకుండా రాజకీయంగా కూడా నష్టపోయామని కొండా మురళీ చెప్పటం అందరికి ఆశ్చర్యం కలిగించాయి. జగన్ కు ఉన్న ఆవేశం వలన తమను నమ్ముకున్న కార్యకర్తలు , నాయకులు తీవ్రంగా నష్టపోయారని సురేఖ ఆవేశంతో అన్నారు. అంతేకాకుండా తెలంగాణ విషయంలో వైఎస్ జగన్ ద్వంద వైఖరి అవలంభించి తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారని ఆమె వాపోయారు. పార్టీ సమావేశాలకు మొదట పిలిచి తనను కొద్ది రోజులు వైఎస్ విజయమ్మ పక్కన కూర్చోబెట్టి , తర్వాత వేదిక కింద కూర్చోబెట్టారని కొండా సురేఖ ఆరోపించారు. అయితే కొండా సురేఖ మరో విషయాన్ని బయట పెట్టారు. లక్షల కోట్ల సంపాదనే జగన్ అనుసరిస్తున్న విధానమని , జగన్ ను సీఎం చేయడం కోసం మంత్రి పదవిని త్రుణప్రాయంగా వదులకున్నారని కొండా సురేఖ కన్నీళ్లతో మీడియా తెలిపారు. వైఎస్ జగన్ , పార్టీ పై కొండా చేసిన కామెంట్స్ పార్టీలో పెనుదూమరం రేపాయి. ఇక ముందు ముందు కొండా ఎలాంటి విషయాలు బయట పెడతారో చూడాలి.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more