ఇందిరా పార్క్ లో నిన్న రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు వైయస్ ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ. చేస్తున్న డిమాండ్, ఫీజ్ రియంబర్స్ మెంటు ప్రణాళికను సక్రమంగా అమలుపరచాలని.
ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు నినాదాలతో ఆ ప్రదేశమంతా మారుమోగేటట్టుగా చేసారు. విజయమ్మ ప్రసంగిస్తూ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల సమస్యలకోసం పాటుపడే పార్టీ అని, కేవలం కార్పొరేట్ కాలేజీల లబ్ధికోసమే దీక్ష చేస్తున్నామని అనటం సరికాదని అన్నారు. ఫీజ్ రియంబర్స్ మెంటుకి పరిమితి పెట్టటం సరైన పద్ధతి కాదని ఆమె అన్నారు. ఎమ్ సెట్ లో 10000 లోపులో వచ్చిన ర్యాంకర్లకే ఈ స్కీమ్ ని వర్తింపజేయటాన్ని ఆమె తప్పు పట్టారు. ఈ నిర్ణయం వలన పేద విద్యార్థులు నష్టపోతారని ఆవిడ అన్నారు.
అంతే కాకుండా, ఒక్కో ఇంజినీరింగ్ కాలేజ్ కి ఒక్కో విధంగా స్లాబ్ లను విధించటం తప్పని, దాని వలన విద్యార్థులు, తల్లిదండ్రులలో అయోమయ స్థితి నెలకొంటున్నదని విజయమ్మ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టటంలో ఉద్దేశ్యం పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యను అభ్యసించటమేనని, దాన్ని కాలరాస్తూ ప్రస్తుత కిరణ్ కుమార్ ప్రభుత్వం ఈ పథకంలో గందరగోళాన్ని సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు.
రూ.3000 కోట్లు కేటాయిస్తేనేగానీ ఈ పథకం సరిగ్గా అమలు లోకి రాదని చెప్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంత సొమ్ముని ఖర్చుపెట్టటమనేది సందేహాస్పదమేనని విజయమ్మ అన్నారు.
అయితే, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ విజయమ్మ మాటలను ఖండించటమే కాకుండా అసలు ఈ దీక్షా కార్యక్రమమే శుద్ధ దండుగ అని అన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో 8 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందితే ఇప్పడు 28 లక్షలమందికి లాభం చేకూరిందని, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సంతృప్తిగానే ఉన్నారని, విజయమ్మే అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని, కేవలం కొన్ని ప్రైవేటు కళాశాలలకు లబ్ధి చేకూర్చటమే దీక్ష లక్ష్యమని బొత్సా అన్నారు.
అయితే అది అంతటితో ఆగిపోలేదు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న వైయస్ షర్మిల బొత్సాను లిక్కర్ మాఫియా అంటూ వ్యాఖ్యానిస్తే, ఏం మీ తండ్రి ప్రతిరోజూ తాగలేదా, నువ్వు నీ భర్త అనిల్ ని కాపాడమని నా చుట్టూ తిరగలేదా అంటూ ఘాటుగా సవాళ్ళు విసిరారు బొత్సా సత్యనారాయణ.
వ్యక్తిగత స్థాయిల్లో విమర్శలను గుప్పించుకునే స్థితికి రాజకీయాలు దిగజారాయంటూ రాజకీయ విమర్శకులు ఇంకా ఏ స్థాయికి పోతాయో అన్న భయాన్ని వెలిబుచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more