ఈ కొత్త వ్యాపార సంస్కృతికి గుజరాత్ రాష్ట్రం వేదికవుతోంది. అహ్మదాబాద్‌లో అడుగడుగునా దీనికి సంబంధించిన ప్రకటనలు యువకుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ...ఈ సరికొత్త వ్యాపారమేమిటంటే...యువకులు వీర్యదాతలుగా మారిపోవడం. అందం, చదువు ఉంటే చాలు వీర్యం కొనుక్కోవడానికి వ్యాపారసంస్ధలు అక్కడ క్యూ కడుతున్నాయి. మీరు మాస్టర్ డిగ్రీ పొంది ఉంటే గంటకు రూ. 2 వేలు ఇట్టే సంపాదించుకోవచ్చు. అందగాడై చూడ్డానికి ఆకర్షణీయంగా ఉన్నారా? అయితే ఇంకేం...అదే గంటకు రూ. 5 వేలు ఆర్జన మీ సొంతమవుతుంది. ఇలాంటి ప్రకటనలు అహ్మదాబాద్‌లోని యువకుల్ని ఎంతో ఆకర్షిస్తున్నాయి.
2011లో రిలీజైన విక్కీడోనర్ సినిమా పుణ్యామాని ఈ కొత్త సంస్కృతి అహ్మదాబాద్‌లో పెచ్చరిల్లింది. పట్టణంలో ఎక్కడ చూసినా స్పెర్మ్ డోనర్స్ కోసం ప్రకటనలు కన్పిస్తున్నాయి. నరేందర్ (పేరు మార్చాం) అనే 21 ఏళ్ల యువకుడు కాసులు సంపాదించుకునేందుకు ఈ మార్గాన్నే ఎంచుకున్నాడు. క్రమం తప్పకుండా వీర్యం ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. వీధుల్లో కనిపించిన ఈ తరహా పోస్టర్‌లో ప్రముఖంగా ప్రచురించిన ఫోన్ నంబర్‌కి తాను కాల్ చేసానని నరేందర్ చెప్పాడు. తన వివరాలు తెలుసుకున్న రెండ్రోజుల తర్వాత కంపెనీ ల్యాబ్ నుంచి తనకో కాల్ వచ్చిందని చెప్తూ ఆ ల్యాబ్ వీఎస్ ఆస్పత్రి సమీపంలో ఉందన్నాడు. వాళ్లని సంప్రదిస్తే...స్పెర్మ్‌తోపాటు రక్తం నమూనా, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఐడీ ప్రూఫ్ ఇవ్వమన్నారని చెప్పాడు. వారు కోరినవిధంగా అన్నీ సమర్పించిన మూడ్రోజులకు ఆ కంపెనీ ప్రతినిధుల నుంచి మళ్లీ కాల్ వచ్చిందని చెప్పారు.
ఆ తర్వాత నుంచి ఆ ల్యాబ్‌కు తరచూ తాను స్పెర్మ్ అందిస్తున్నానని నరేందర్ తెలిపాడు. నెలలో తాను మూడు నుంచి అయిదుసార్లు వీర్యాన్ని ఇస్తున్నానని చెప్తూ ప్రతిసారి తనకు రూ. 5000 ముడుతున్నాయన్నాడు. విద్యార్హతలు, అందం తదితర కారణాలతో ఓ యువకుడి వీర్యానికి ఇచ్చే ధరలో మార్పు ఉంటుందని చెప్తున్నాడు. ప్రొఫెషనల్ డిగ్రీతోపాటు చూడచక్కని రూపం కలిగి ఉంటే ఒక్కసారికే రూ. 5 వేలు పొందొచ్చన్నాడు. విద్యార్ధులకైతే కచ్చితంగా వెయ్యి రూపాయలు దక్కుతాయని చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more