క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రముఖ నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఇప్పుడు అసెంబ్లీ పై కన్నేసాడు. అంటే తన జీవితం కాలంలో ఒక్కసారైన ..‘అద్యక్షా..’ అని పిలిచే కోరికను తీర్చుకోవాలని బండ్ల గణేష్ ఆశపడుతున్నారు. ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చిన బండ్ల గణషే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చెయ్యటానికి రేఢీ అవుతున్నారు. అందుకు తనకు అనువైన నియోజకవర్గాన్ని నిర్ణయించుకోని, అక్కడ తన కార్యకాలపాలు సాగిస్తున్నారు. షాద్ నగర్ అంసెబ్లీ నియోజకవర్గాన్ని తనకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడి నుండి పోటీ చెయ్యటానికి సిద్దమవుతున్నాడు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చెయ్యటానికి ఇప్పటి నుంచి కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. బండ్ల గణేష్ కు బడా నిర్మాత కావటంతో వెనుక కాంగ్రెస్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఉన్నాడనే విమర్శలు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే.. బొత్సకు బినామీ బండ్ల గణేష్ అని కూడా టాలీవుడ్ లో అంటారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స ఎలాగైన బండ్ల గణేష్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించాలనే ఉద్దేశంలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా బండ్ల గణేష్ కేంద్ర మంత్రి అయిన మెగా స్టార్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా హీరోలతో నాలుగు సినిమాలు తీసిన బడా నిర్మాతగా మెగా స్టార్ చిరంజీవి అభిమానం పోందాడు. బొత్స , చిరంజీవి కలిస్తే ప్రయత్నిస్తే బండ్ల గణేష్ కు కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే టిక్కెట్ దొరకటం ఖాయమని రాజకీయ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి చాలా సహాజంగా జరుగుతుంటాయి. వందేళ్ల చరిత్రలో ఇలాంటి ఘటనలు చాలా జరిగినట్లు మన రాజకీయ నాయకులు అంటున్నారు. బండ్ల గణేష్ కూడా ఎన్నికల్లో గెలవటానికి ఎంత ఖర్చు అయిన పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షాద్ నగర్ సిటింగ్ ఎమ్మెల్యే ఇందుకు ఓప్పుకుంటాడా? అంటే ఆ విషయం కాంగ్రెస్ పెద్దలు చూసుకుంటారు మనకేందుకు? బండ్ల గణేష్ షాద్ నగర్ నే ఎందుకు ఎంచుకున్నాడు ? ఇక్కడే అసలు విషయం ఉంది. బండ్ల గణేష్ కు సంబందించిన ఆస్తులు, రియల్ ఎస్టేట్ భూములు ఎక్కువు మొత్తంలో ఇక్కడే ఉన్నాయని కాబట్టి షాద్ నగర్ నుంచి పోటీ చెయ్యటానికి బండ్ల పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటి నుండే బండ్ల గణేష్ లో ఎన్నికల మూడ్ కనిపిస్తుందని షాద్ నగర్ ప్రజలు అంటున్నారు. షాద్ నగర్ నియోజక వర్గంలో బండ్ల గణేష్ చేసే ప్రజా సేవా అలా ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. బడా నిర్మాత బండ్ల గణేష్ కల తీరాలని కోరుకుందాం..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more