బావ, బావమరిది-ఒక అల్లుడు .. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నడుస్తున్నా రాజకీయం. బావ కోసం బావమరిది కష్టపడుతున్నాడు. కొడుకు కోసం తండ్రి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తండ్రి కోసం రాజకీయల్లోకి వచ్చిన తనయుడు. ఈ ఇద్దరి కోసం నిరంతరం కష్టపడుతున్న బాలయ్య. ఈ ముగ్గురు ఫార్ములా ఒక్కటే. ఎటూ చూసిన ఈ ముగ్గురే టిడిపీలో కనిపిస్తున్నారు.
అందుకే వీరు రాబోయే ఎన్నికలను దుష్టిలో పెట్టుకొని గెలుపు నియోజక వర్గాలపై కన్నువేశారు. తెలంగాణలో లోకేష్ పోటీ? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు! ఎన్నికలకు మరో ఏడాది గడువు మాత్రమే ఉండటంతో ఆయన జిల్లాలను చుట్టేస్తున్నారు. మినీ మహానాడు కార్యక్రమాలలో ఆయా జిల్లాల్లో పాల్గొంటున్నారు.
కరీంనగర్ జిల్లా మహానాడులో పాల్గొన్న లోకేష్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో పాల్గొననున్నారు. ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్న నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. యువతను ఉత్సాహపరిచేందుకు, పార్టీ కోసం అన్ని విధాలుగా పని చేసేందుకు లోకేష్ ఎన్నికల్లో దిగాలని ఆయనకు, పార్టీ అధినేతకు పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితం చూపే నియోజకవర్గం నుండి పోటీ చేయాలని టిడిపి నేతలు సూచిస్తున్నారట.
అవసరమైతే రాష్ట్ర రాజదాని హైదరాబాదులోని ఏదైనా ఓ నియోజకవర్గం నుండి లోకేష్‌ను బరిలోకి దించాలని తెలుగు తమ్ముళ్లు ప్రధానంగా నగర తెలుగు తమ్ముళ్లు ఉబలాటపడుతున్నారట. దీనిపై లోకేష్, పార్టీలోని ఇతర ముఖ్య నేతలు కూడా చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. చిత్తూరు జిల్లాలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారు. ఆంధ్రా ప్రాంతం నుండి హీరో నందమూరి బాలకృష్ణ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ తెలంగాణ ప్రాంతమైన హైదరాబాదు లోని శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయవచ్చునని చెబుతున్నారు. శేరిలింగం పల్లి నియోజకవర్గాన్ని అత్యంత సేఫ్ ప్లేస్ గా పరిగణిస్తూ ఇక్కడి నుంచి లోకేష్ బాబు ను రంగంలోకి దించటానికి ఫ్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ఏదైతే తాను సాధించిన అభివ్రుద్ది అని చెప్పుకుంటూ ఉంటారో.. ఆ అభివ్రుద్ది ఫలాలాను అనుభవిస్తున్న వారంతా ఇక్కడే ఉన్నారు.
తన రూపకల్పనలో వచ్చిన హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న అపరిమితమైన సాఫ్ట్ వేర్ ఓట్లు .. చిన బాబు గెలిపించకపోతాయా అనేది చంద్రబాబు ఆశ. అయితే ఒకే కుటుంబంలోని ముగ్గురు మూడు ప్రాంతాల్లో పోటీ చేస్తే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు కూడా ఉత్సహంగా ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more