బెంగాల్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఏ అంశంపైన అయినా ముక్కుసూటిగా మాట్లాడే ఆమెకే ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. రాష్ట్ర రాజకీయాలను శారద చిట్ ఫండ్ కుంభకోణం కుదిపేస్తుండడం, అందులో పలువురు పార్టీ నేతలు భాగస్వాములుగా ఉన్నారన్న ఆరోపణలు మమతను ఊపిరి తీసుకోనీయడం లేదు. కుంభకోణ సూత్రధారులు, పాత్రదారులంటూ తృణమూల్ నేతల పేర్లు ఒక్కొక్కటిగా బయటికి పొక్కుతుండడంతో ఆమెకు తలనొప్పిగా మారింది. మునుపెన్నడూ లేనంతగా విపక్షాలు ముప్పేటా దాడి చేస్తుండడంతో రాజకీయంగా ఆమెకు చిక్కులు ఎదురవుతున్నాయి. కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వేటు వేయాలని విపక్షం నుంచే కాకుండా స్వపక్షం నుంచి డిమాండ్లు ఊపందుకోవడంతో మునుపెన్నడూ లేనంతగా మమత రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతున్న ఛాయలు కనపడుతున్నాయి. 'శారద' బాధితుల్లో అత్యధికులు పేద, మధ్యతరగతి ప్రజలే. పైసాపైసా వెనకేసుకుని ప్రతినెలా చిట్‌ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారంతా చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో ఇప్పుడు నెత్తినోరూ బాదుకుంటున్నారు.
ఈ పాపంలో అధికార పార్టీ నేతలకూ భాగం ఉందని ఆరోపణలు వస్తుండడంతో గ్రామీణ ప్రజలంతా మమత సర్కార్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతూ ఉన్నారు. ఆమె నిజాయితీని శంకిస్తున్నారు.కనుచూపు మేరలో రాష్ట్ర స్థానిక సంస్థలకు ఎన్నికలు, ముంచుకొస్తున్న 2014లోక్‌సభ పోరు నేపథ్యంలో శారద కుంభకోణం మమతను కలవరపెడుతోంది. చిట్‌ఫండ్‌తో నష్టపోయిన వారంతా గ్రామీణులే కావడం తృణమూల్‌కు ఎదురుదెబ్బే. పట్టణ ఓటర్లతో పెద్దగా నష్టమేమీ పొంచిలేనప్పటికీ, గ్రామీణ ఓటు బ్యాంకుకు భారీ తూట్లు పడే అవకాశాలు కనపడుతున్నాయి. కొద్ది రోజులుగా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతుండడమే దీనికి తార్కాణం. ఎంపీలు కునాల్ ఘోష్, శతాబ్దిరాయ్, మంత్రి మదన్ మిత్రాలకు శారద గ్రూప్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. కంపెనీ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు హాజరై పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలను పురిగొల్పారు.
ఇక చిట్‌ఫండ్ కంపెనీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వారిలో అత్యధికులు గ్రామస్థాయి తృణమూల్ నేతలే. వీరికి స్థానిక ప్రజలతో సత్సంబంధాలుండడంతో పెద్ద ఎత్తున్న ఖాతాదారులను చేర్చుకోవడానికి సహకరించింది. తాజాగా కుంభకోణం వెలుగుచూడడంతో ప్రజలకు సహజంగా వీరన్నా, ఆ పార్టీ నేతలన్నా ఏహ్యభావం ఏర్పడే ప్ర మాదం ఉందని తృణమూల్ నేతలు పలువురు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యలో వీలైనంత త్వరగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్ర మించి నష్టనివారణ చర్యలకు ఉపక్రమించాలని అధినేత్రి మమ తను కోరుతున్నారు. ఎంపీ శిశిర్ అధికారి మాట్లాడుతూ...కుంభకోణంలో పాత్రధారులు ఎవరైనా, చివరికి అది తానైనా వేటు పడాల్సిందే అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరో ఎంపీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more