పన్నెండు సంవత్సరాలకోసారి వచ్చే కుంభమేలా రెండు నెలలపాటు త్రివేణీ సంగమంలో మార్చి 10 వరకూ జరిగింది. ఆ సమయంలో దేశ విదేశాల నుంచి అక్కడకు వచ్చిన భక్తులు, పర్యటకులతో కళకళాడిన ప్రదేశమంతా ఇప్పుడు చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. కానీ జనసంచారం లేకుండా లేదు. ఇప్పుడు అక్కడ మిగిలిపోయిన కాలుష్య వాతావరణంలో ఆరోగ్యాన్ని లెక్క చెయ్యకుండా, ప్రధూషణాలలోనే నిధులను అన్వేషించేవారితో నిండిపోయింది.
దేవాలయాలలోనూ, పుణ్య నదులలోనూ భక్తులు కానుకలను సమర్పించుకునే ఆనవాయితీ ఉన్న దేశం కనుక అంతమంది వచ్చినప్పుడు ప్రతివారూ కచ్చితంగా ఎంతో కొంత నాణేల రూపంలోనూ, బంగారం రూపంలోనూ గంగానదిలో వదిలిపెట్టేవుంటారని తెలుసు కాబట్టి, దొరికినంత చేతబుచ్చుకుందామని పిల్లాపాపలతో వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆలయాల్లో హుండీలుంటాయి, వాటికి భద్రత, వాటిని తెరిచే అధికారంతో పాటు వినియోగించే అధికారాలున్న ఆలయ యాజమాన్యం ఉంటుంది. కానీ నదులలో ఇంకా అలాంటిదేమీ లేదు కాబట్టి భక్తులు వదిలి వెళ్ళినవాటిలో ఎవరికెంత దొరికితే అంత.
త్రివేణీ సంగమంలో మామూలు రోజుల్లో కూడా నీటిలో వదిలిన కొబ్బరికాయలను కూడా వదలకుండా ముందు నుంచే నీటిలో ఎదురుచూసేవాళ్ళున్నారు. అవే కొబ్బరికాయలను తిరిగి సగం రేటుకి దుకాణాలలో అమ్మేస్తారు.
అయ్యో పాపం అని భక్తులనుకుంటారు, పిచ్చోళ్ళు పాపం పారేసుకుంటున్నారు అని వీళ్ళు భక్తులననుకుంటారు. ధర్మం- అంటే చెయ్యవలసిన పుణ్య కార్యంలో పేదలకు పంచిపెట్టటం కూడా ఒక భాగంగా ఆచారమైంది. అందుకే ధర్మం చెయ్యండి బాబూ అంటూ మీ ధర్మాన్ని మీకు గుర్తు చేస్తారు భిక్షకులు.
ఉత్తర భారతదేశంలో దీపావళి తర్వాత మిగిలిపోయిన మిఠాయిలను, బాణాసంచాను కూడా చెత్తలోపడేస్తే అందులో వెతుక్కునేవాళ్ళెందరో కనిపిస్తారు. ఈ దృశ్యాలను చూస్తే సాటి మానవులను మనం కలుపుకోకుండా ముందుకు వెళ్తున్నామేమో అనే భావన చాలామందికి తాత్కాలికంగానైనా కలుగుతుంది, ఇది ప్రగతిమార్గమేనా అన్న ప్రశ్న ఉదయిస్తుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more