Stars seem unfavorable to cine stars

legal cases on cine stars, saif ali khan, salman khan, sanjay dutt, tabu, neelam, sonali bindre

stars seem unfavorable to cine stars

star-power.png

Posted: 03/23/2013 02:16 PM IST
Stars seem unfavorable to cine stars

stars-cine-stars

స్టార్ ల స్టార్ లు బెడిసికొడుతున్నాయా.  మొన్న సంజయ్ దత్, ఈ రోజు సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, నీలమ్, తబు, సోనాలీ బింద్రేలు న్యాయస్థానాల్లో.  వాళ్ళే తారలు కాబట్టి వాళ్ళు ఏదైనా చెయ్యగలరని అనుకుంటే వాళ్ళ స్టార్ లు అందుకు అనుకూలించాలని లేదు.  

సంజయ్ దత్ కేసులో రాజకీయరంగంలో పలుకుబడి ఉన్న సునీల్ దత్ కూడా ఆయన బ్రతికున్న కాలంలో ఏమీ చెయ్యలేకపోయారు.  ఆయుధాలను తన దగ్గర కలిగివున్న నేరం మీద సంజయ్ దత్ కి 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది.  

2002 లో తప్పతాగి కారు నడుపుతూ ఫుట్ పాత్ మీద పడుకున్న ఉన్న వాళ్ళల్లో ఒక మనిషి మరణానికి నలుగురి గాయపడటానికి కారకుడైన సల్మాన్ ఖాన్ మీద ఇప్పటి వరకూ ఉన్న కేసు ఐపిసి 304 ఏ.  అది అజాగ్రత్త వలన జరిగిన ప్రాణనష్టం.  కానీ ఆ ఛార్జని తాజాగా ఐపిసి 304-2 కి మార్చటం జరిగింది.  అంటే, హత్య చేసే ఉద్దేశ్యంతో చెయ్యటం కాకపోయినా మానవ హత్య కిందికి వస్తుంది.  ఇది పాత ఛార్జ్ కన్నా ఎక్కువ తీవ్రమైన ఆరోపణ.  విచారణ జరిగి నేరం ఋజువైతే ఈ సెక్షన్ కింద 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది.  

సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, నీలమ్, తబు, సోనాలీ బింద్రేలు 1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ కోసం జోథ్ పూర్ వెళ్ళినప్పుడు అక్కడ సమీప గ్రామంలో జింకలను వేటాడారు.  బ్లాక్ బక్ అనబడే ఈ లేళ్ళు చర్మానికి పనికి వస్తాయి.  ఈ జాతి అంతరించిపోతుండటం వలన వీటి పరిరక్షణ కోసం చట్టం చెయ్యబడింది.  అందువలన వన్య ప్రాణుల చట్టం ప్రకారం రక్షిత జాతియైన ఆ జంతువుని కాల్చి చంపిన నేరానికి ఈ ఐదుగురే కాక వీళ్ళకి సాయం చేసిన స్థానిక నివాసి దుష్యంత్ సింగ్ మీద కూడా కేసు అప్పట్లోనే నమోదయింది.  ఈ కేసు లో రాజస్తాన్ హైకోర్టు డిసెంబర్ 2012 లో వీరి మీది కేసులను వన్య ప్రాణుల పరిరక్షణ చట్టంలో సెక్షన్ 51 కింద రివైజ్ చెయ్యగా ఈరోజు జోథ్ పూర్ కోర్టు తాజాగా వీరి మీద ఆరోపణలను చేసింది.  దుష్యంత్ సింగ్ మీద సెక్షన్ 51, 52 కాక ఐపిసి 149 కింది కూడా ఆరోపణలను రివైజ్ చెయ్యటం జరిగింది.  దీని మీద ఏప్రిల్ 27 లో మళ్ళీ విచారణ జరుగుతుంది.  

సల్మాన్ ఖాన్ ఈ రోజు జోథ్ పూర్ కోర్టులో హాజరుకావలసింది కానీ నరాల చికిత్స కోసం అమెరికా వెళ్ళిన సల్మాన్ ఖాన్ తిరిగి రాలేకపోయారు.  అయితే సల్మాన్ ఖాన్ మీద ఆరోపణలను రాజస్తాన్ హైకోర్టు రివైజ్ చెయ్యలేదు.  

సైఫ్ అలీ ఖాన్ తండ్రి పటౌడీ నవాబ్ కూడా తన 70 సంవత్సరాల వయసులో ఫరిదాబాద్ దగ్గర ఝజ్జర్ గ్రామంలో 2005లో  బ్లాక్ బక్ జింకలను సంహరించిన కేసుని ఎదుర్కున్నారు.  

మొత్తం మీద సినీ తారలకు తారాబలమేమీ బాగున్నట్టుగా లేదు.  ఏ పని చెయ్యటానికి పూనుకున్నా జాగ్రత్తగా ఆలోచించి అడుగెయ్యటం మంచిది.  తమాషా ఏమిటంటే ఎప్పటి కేసులో మర్చిపోయిన వన్నీ తిరగదోడటమవుతోంది.  అదే మరి గ్రహబలం బాగోలేకపోవటమంటే.  సంజయ్ దత్ కేసు 20 సంవత్సరాల క్రితంది.  సల్మాన్ ఖాన్ కేసు, సైఫ్ అలీ వగైరాల కేసులు కూడా దాదాపూ 19, 20 సంవత్సరాల క్రితం జరిగిన నేరాలే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Are modern ways causing rapes in india
Police and family versions on liyaqat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more