Are modern ways causing rapes in india

rapes in india, modern ways of youth, mamata banarjee, tirumal rao, law against rape

are modern ways causing rapes in india

modern-ways.png

Posted: 03/23/2013 04:38 PM IST
Are modern ways causing rapes in india

mamata-banerjeeఈ రోజు మమతా బెనర్జీ, ఒకప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అత్యాచార చట్టం మీద చర్చించిన నాయకులు వీళ్ళంతా మాట్లాడిన మాటలు వేరైనా తాత్పర్యం ఒక్కటే- మహిళలమీద అత్యాచారాలకు మహిళల వైపు నుంచి కూడా తప్పులున్నాయని.

ఒక అపరాధం ఎందుకు జరుగుతోంది అని తరచి చూస్తున్నప్పుడు తోచిన కారణాన్ని చెప్పినవాళ్ళని తప్పు పట్టటం సరికాదు.  ఉదాహరణకు, సైనికులు వెనక్కి వచ్చేస్తున్న సమయంలో గ్రామాలలోని మహిళల పట్ల అత్యాచారం చేసిన ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వెలుగు చూస్తాయి.  వాళ్ళు చేసింది తప్పు కాదని ఎవరూ అనరు.  కానీ ఎందుకు చేసారని తరచి చూడటం కూడా తప్పు కాదు.  అలాగే ఒక సమయమంటూ లేకుండా డ్యూటీలు చేస్తున్న పోలీసులు కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి.  వాళ్ళు అలా చెయ్యటానికి కారణం ఆ సమయంలో వారి మానసిక స్థితి, అదుపు తప్పిన భావోద్వేగాలను ఉపశాంతి కలగటానికి లభించిన అవకాశం అని అన్నప్పుడు అలా చేసినవారిని సమర్థించటం అవదు.  

అలాగే, అనుభవంతో చెప్పేవారి అభిప్రాయాలను గౌరవించాలి కానీ వారిని తప్పు పట్టటం కాదు.  తప్పు చేసిన ప్రతివారూ అందుకు కారణాలు బాగానే చెప్తారు కాబట్టి, ఎందుకు చేసారు అని తరచి చూడటం వారిని సమర్థించటం కోసం కాదు.  అటువంటి సందర్భాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించటం కోసం.

ఆధునిక విధానాలనే అందరూ తప్పుపడుతున్నారు.  మహిళలు వేసుకునే దుస్తులు కానీ వారికి లభించిన స్వేచ్ఛా స్వాతంత్రాలు కానీ విమర్శలకు గురౌతున్నాయి.  అలాగని మహిళలకు స్వాతంత్ర్యం ఉండగూడదని వారి ఉద్దేశ్యం కూడా కాదు.  జేబులో పైకి కనిపించేట్టుగా డబ్బులు పెట్టుకుని బస్సులో ఎక్కితే ఎవరైనా అంటారు అలా కనపడేట్టుగా పెట్టుకోవద్దని.  అలాగని జేబులు కొట్టే వారిని వెనకేసుకురావటం కాదు.  మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్పటం.  

అలాగే ఆధునికత పేరుతో మగవాళ్ళను రెచ్చగొట్టే విధంగా ఉండటం వలన అటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పటం మగవాళ్ళ తప్పు లేదని అనటం కాదు.  అందుకు వాతావరణాన్ని కలుగజేయవద్దని చెప్పటం.  నేను తాళం వేసుకోలేదు సరే దొంగిలించిన దొంగలను అనరేం అంటే.  ఆడవాళ్ళే కాదు అనేక సందర్భాల్లో మగవాళ్ళకు కూడా (మగవాళ్ళ నుంచే) భద్రత లేదని తెలిసింది.

ఎలాగూ ఉన్న విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలా ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవటం కాకుండా ఉన్న సత్యాన్ని అర్థం చేసుకుందాం, పరిష్కార మార్గమేమిటో ఆలోచిద్దాం.  

అన్నిటికంటే ముందుగా ఆడవాళ్ళంటే ఆకర్షించేవాళ్ళు, మగవాళ్ళు ఆకర్షింపబడేవాళ్ళు అనే అభిప్రాయం మనసుల్లోంచి చెరిగిపోవాలి.  పొట్టీ పొడవు, నలుపు తెలుపు, లావు సన్నం ఇలా రకరకాలుగా మనుషులున్నట్టే, అందులో కొందరు ఆడ కొందరు మగ మరి కొందరు ఈ రెండు లక్షణాలు లేనివారుంటారని అర్థం చేసుకోవాలి.

 లింగ భేదానికి ప్రాధాన్యతనిస్తూ సాహిత్యాలు, పాటలు, ఉపన్యాసాలు, సలహాలు ఉండకూడదు.  

ఆడవాళ్ళకి ప్రత్యేకమైన లైన్లు, ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఉండటం వలన వాళ్ళు వేరు అనే భావన మగవారిలో కలుగుతోంది.  ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ప్రత్యేక మైన ఏర్పాట్లు చెయ్యడం ద్వారా వాళ్ళకి సౌకర్యాన్ని కలిగిస్తున్నామని అనుకుంటున్నారు కానీ దాని వలన ఆడ మగ మధ్య అఘాతం మరింత ఎక్కువౌతోందని అనుకోవటం లేదు.  

movie-stars

కథల్లో సినిమాల్లో ఆడ మగ సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం జరుగుతోంది.  మానవ సంబంధాలుగా ఉండాలి కానీ లింగభేదం వలన కలిగే సంబంధాలతో కాదన్నది తెలియాలి.  ప్రేమకు అసలు అర్థమేమిటో తెలియజెప్పే కథలుండాలి కానీ, ప్రేమంటే ఆడ మగల శృంగార వాంఛతో కూడినదే ప్రేమ కాదు.  నేను ప్రేమిస్తున్నా నా ప్రేమ పాత్రులు అని చెప్పే మాటలకు అర్థం మారిపోయి అలా అనటం తప్పు అనే భావన కలిగిస్తోంది.  ఇటువంటి ప్రేమ కథలతో వస్తున్న సినిమాలు సాహిత్యాల వలన మానవుల మనసుల్లో ప్రేమ అంటే శృంగార భావన తప్ప మరేమీ రావటం లేదు.  అంతేకాదు సంభాషణల్లోనూ, అమ్మాయి ని పడెయ్యటం ఎలా అని వివరించటం, ఎలాంటి అమ్మాయినైనా నేను పడేస్తాననటం, ఆడవాళ్ళని ఏడిపించటం ఇటువంటి పద ప్రయోగాలు పోవాలి.  ముఖ్యంగా దుస్తుల విషయంలో ఇలా ఉంటేనే ఆధునికత అనే భావాన్ని కలిగిస్తున్న సినిమాల వలన కూడా మనసులో అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.

ఆత్మహత్యలు చేసుకోవటం ఎలాగైతే మానవులకే ప్రత్యేకమో అలాగే బలవంతంగా అనుభవించాలని అనుకోవటం కూడా మానవులకే చెల్లింది.  ఆహారం, అధికారం ఇలాంటి విషయాలలో పోరాటాలు జరుగుతాయి కానీ, విశ్వంలోని ఏ ప్రాణీ మరో ప్రాణిని బలాత్కారం చెయ్యటం చూడం.  మనిషి ఎదిగి జంతువులు స్వార్థంతో చేసే ఆ పోరాటాలను గర్హిస్తూ అటువంటి నడవడిక మంచిది కాదని తెలుసుకోవటం పోయి, అటువంటి వాటికోసమే కాకుండా జంతువులకు కూడా లేని  లైంగిక వేధింపులకు పూనుకోవటం చూస్తుంటే, మనిషిలో పరిణితి రాలేదని తెలుస్తోంది.

ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు కథలు చెప్పే రోజులు పోయాయి.  పిల్లలకు వాళ్ళ ఆటలు టివి ప్రోగ్రాంలు చాలు.  ధనసంపాదనలో పడ్డ పెద్దవాళ్ళకు తీరిక కూడా ఉండదు కాబట్టి పిల్లలు వాళ్ళంతట వాళ్లుండటం వీళ్ళకీ ఆటవిడుపే అయిపోయింది.  అలా కాకుండా పిల్లలను తీర్చిదిద్దటం కూడ బాధ్యతే అని తెలుసుకుని వారితో గడుపుతూ మాటల్లో వాళ్ళల్లో లింగభేదమనేది రాకుండా చెయ్యాలి.  

ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కొన్ని వందల సంవత్సరాలకు ఈ బేధం పూర్తిగా పోతుందని నా గాఢ విశ్వాసం, అందుకు ఇప్పటి నుంచే విత్తనాలు వెయ్యటం మొదలుపెడితే అదైనా.  ఇవేమీ చెయ్యకుండా, మగపిల్లలది తప్పని లేదా ఆడపిల్లలు అలా ఉండటం తప్పని అనటం సరికాదు.  కారణాలనే కలుపు మొక్కలను వెతికి పట్టుకుని వాటిని పెరికివేయాలి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp warns to conduct dharna and mock assembly
Stars seem unfavorable to cine stars  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more