పోలీస్ యూనిఫామ్ మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వస్తుందని టాలీవుడ్ టాక్ ఉన్న విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి ఎస్సీ పరుశురాం సినిమా లో పోలీసు యూనిఫామ్ దుమ్ము దులిపేశాడు. అలాగే నాగబాబు .. కొన్ని సినిమాల్లో పోలీస్ యూనియ్ తో కనిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. రీసెంట్ టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ యాక్షన్ సినిమా ప్రేక్షకులకు చాలా నచ్చింది. ఇపుడు అదే బాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. రామ్ చరణ్ కూడా పోలీస్ యూనిఫామ్ తో టాలీవుడ్ లో కొత్త చరిత్ర పుట్టిస్తాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న ‘జంజీర్’ సినిమాలో రామ్ చరణ్ అత్యంత ప్రమాదకరమైన సాహసం చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ చేసిన సాహాసానికి బాలీవుడ్ వర్గాలు సైతం నోర్లు తెరిచాయి. ‘‘ఒంటిపై యూనిఫామ్ ఉంది కాబట్టి బతికిపోయావ్. తీసి రా... ఎవరి సత్తా ఎంతో తేల్చుకుందాం’’ అన్నాడు షేర్‌ఖాన్. ఇన్‌స్పెక్టర్ విజయ్ కళ్లు ఎర్రబారాయి. షేర్‌ఖాన్‌ని వదిలేయమని కానిస్టేబుల్స్‌కి ఆర్డర్ పాస్ చేశాడు. విజయగర్వంతో స్టేషన్ దాటాడు షేర్‌ఖాన్. ఆ రోజు సాయంత్రం తుఫాన్‌కి ముందు ఉండే ప్రశాంతతను మరిపిస్తోంది షేర్‌ఖాన్ ఉండే వీధి. అప్పుడొచ్చాడు విజయ్. ఇప్పుడు అతని ఒంటిపై యూనిఫామ్ లేదు. సాధారణ డ్రెస్‌లో ఉన్నాడు. ఇంకేముంది... రెండు సింహాలూ తలపడ్డాయి. భారతీయ సినిమా చరిత్రలో ఈ సన్నివేశానిది ఓ ప్రత్యేకస్థానం. తర్వాత ఇదే సీన్‌ని అనుసరించి కొన్ని వందల సన్నివేశాలొచ్చాయి. 40ఏళ్ల క్రితం హిందీలో వచ్చిన ‘జంజీర్’లో అమితాబ్‌బచ్చన్-ప్రాణ్, తెలుగులో దానికి రీమేక్‌గా వచ్చిన ‘నిప్పులాంటి మనిషి’లో ఎన్టీఆర్-సత్యనారాయణ ఈ సన్నివేశంలో చెలరేగిపోయారు.
ఇప్పుడు రామ్‌చరణ్ వంతు వచ్చింది. ఇదే సీన్ నటించాలి. హిందీ, తెలుగు రెండూ తనే చేయాలి. ఆ లెజెండ్లను మరిపించనక్కర్లేదు. కనీసం తలపిస్తే చాలు. నిజంగా ఒక నటునికి ఇంతకు మించిన అగ్ని పరీక్ష వేరే ఉండదు. అందుకేనేమో... ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. మూడంతస్థుల బిల్డింగ్ మీద నుంచి ఎలాంటి రోప్‌ల సాయం ఆశ్రయించకుండా అమాంతం కిందకు దూకేశాడు. అంతే... లొకేషన్లో అంతా షాక్. దర్శకుడు అపూర్వ లఖియాకైతే నోట మాట రాలేదు. చరిత్ర సృష్టించిన అలనాటి పోరాటాన్ని నాలుగు రోజుల క్రితం ముంబయ్‌లో రామ్‌చరణ్, శ్రీహరి(హిందీలో సంజయ్‌దత్)లపై చిత్రీకరించారు అపూర్వ లఖియా. ఈ ఫైట్‌లో చరణ్ చేసిన ఈ రిస్కీ ఫీట్ లొకేషన్లో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.అమితాబ్, ఎన్టీఆర్‌లకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ పాత్రను రక్తికట్టించడానికి చరణ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ ఫీట్‌ని చూస్తే అవగతం అవుతుంది. హిందీ, తెలుగు వెర్షన్లను ఒకేసారి తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అపూర్వ లఖియా. ‘జంజీర్’ తెలుగు వెర్షన్ దర్శకుడు యోగి పర్యవేక్షణలో తయారవుతోంది. తెలుగువెర్షన్‌లో షేర్‌ఖాన్‌గా ముందు సోనూసూద్‌ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. శ్రీహరి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పాత్ర చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన శ్రీహరి ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వస్తోందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more