ఈ రోజుల్లో .. కొంచెం అంగవైకల్యం ఉంటే చాలు ఇక జీవితమే చీకటి అని చెప్పి, వేల రూపాయలు డాక్టర్ల చేతిలో పెట్టి కత్తులతో, సర్జరీలతో, సరిచేయికుంటున్న రోజుల్లో, ఒక మహానుభావుడు 65 సంవత్సరాల నుండి అందవికారంగా ఉన్న.. బాధపడకుండా తన నూరేళ్ల జీవితాన్ని వైపు ఆనందంగా అడుగులు వేస్తున్న వ్యక్తి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు. భారతీయ ప్రజలు ప్రతి రూపంలోను ఒక దేవుడిన్ని రూపం చూస్తారు. మన స్రుష్టింలో అందరం అందగా ఉండాలనే రూల్ ఏం లేదు. మనం దేవుడు చేసిన బొమ్మలం, ఆయన ఏం రూపం ఇస్తే అదే రూపంలో పుడతాం. ‘‘నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా’’ చెప్పాండి? అంగవైకల్యంతో పుట్టిన వాళ్లను హీనంగా చూస్తూ, అసహ్యించుకునే వారు, ఈ 65 సంవత్సరాల గణేష్ ను చూసి ప్రతి ఒక్కరు చాలా నేర్చుకోవాలి. ప్రక్రుతిలో పుట్టే ప్రతి పువ్వులు అన్ని పనికొస్తాయి. అయితే అందులో మనం కొన్నింటిని మంచి పువ్వులు గాను, మరికొన్ని చెడ్డ పువ్వులుగా చూస్తాం. కానీ ఏ రో జు కూడా అవి మనిషికి హానీ చేసిన దాఖలు లేవు. అలాగే 65 సంవత్సరాల గణేష్ తన చిన్నతంలో బుగ్గ పై వచ్చిన చిన్న ముద్ద, అతని జీవితాన్ని మార్చుతుందని తెలియదు. అతని వయస్సుతో పాటు బుగ్గ పై ముద్ద కూడా పెరుగుతూ వచ్చింది. అయితే గణేష్ తల్లిదండ్రులు మాత్రం తన కొడుకును ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతూ.. ఆ ముద్దను తొలగించాలని విశ్వప్రయత్నం చేశారు. కానీ వారు ఏ రోజు తన కొడుకు బుగ్గ పై ముద్దను పెద్ద లోపంగా చూడలేదు.
కానీ డాక్టర్లకు తన కొడుకు బుగ్గ పై ముద్దను చూపించి వేల రూపాయలు ఖర్చుపెట్టారు. కానీ ఈ క్రమంలో గణేష్ ను వదిలి తల్లిదండ్రులు కాలం చేశారు గానీ, తన శరీరం మీద పుట్టిన ముద్ద మాత్రం తొలగిపోలేదు. అయితే గణేష్ తన బుగ్గ పై పెరుగుతున్న ముద్ద గురించి ఏ రోజు పట్టించుకోలేదు. కానీ ఇంటిలో ఉన్న అన్నదమ్ములు, ఊరి జనం మాత్రం గణేష్ ను ఒక దేయ్యం మాదిరిగా భావించి .. అతన్ని దూరంగా పెట్టేవారు. అప్పుడు కూడా గణేష్ మనసులో ఎలాంటి బాధపడలేదు. కారణం ఒక్కటే. ‘‘నాకు ఇది దేవుడిచ్చిన వరం’’, అనుకుంటూ తన జీవితంలో ముందుకు సాగిపోవటం గణేష్ పని. ఆస్తీలో సంపన్నుడు అయిన గణేష్ ను , అందవికారంగా ఉన్నడనే ఒక్క కారణంతో తన సొంత అన్నదమ్ములు.. ఆస్తిని తీసుకోవటం జరిగింది. ఆ సమయంలోనే గణేష్ కు ఊరి జనం నుండి వేధింపులు ఎక్కువు అవ్వటంతో.. ‘‘ నా వల్ల వీరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో.’’. గణేష్ ఊరి విడిచి హరిద్వార్ చేరుకోవటం జరిగింది. ఊరి జనం, తన బంధువుల మేలు కోరుకున్న గణేష్ కు హరిద్వారే ఆశ్రయం అయింది. గణేష్ కు ఉండానికి ఇల్లు లేదు, చేతిలో డబ్బులేదు, అయిన గణేష్ లో ఎక్కడ కూడా నిరాశ , అసంత్రుప్తి, జీవితం మీద విరక్తి లాంటివి ఆయన లో కొంచెం కూడా కనిపించేలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతున్న గణేష్ జీవితం హరిద్వార్ ప్రజలకు ‘‘ఒక గణేష్’’(వినాయకుడి) రూపం అతని లో కనిపించింది. అయినవాళ్లు కాదుకున్న, ఆదుకోవటానికి ఆ దేవుడే ఉన్నాడు అనేది గణేష్ జీవితంలో జరిగింది.
హరిద్వార్ కు వచ్చే భక్తులు, ప్రజలు , అతనిలో హిందు దేవుడైన గణేష్ రూపం ఉందని గమనించి, అతను చెయి సాచి అడగకముందే.. ప్రజలు అతనికి సానుభూతిగా ఆహారం, డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయంలో గణేష్ మాత్రం ఇది దేవుడిచ్చిన వరంగాను, ప్రసాదంగాను భావిస్తున్నానని నవ్వుతు చెబుతున్నారు. అందంలో ఏముంది చెప్పాండి. మనసులో కల్మషం లేకుండా ఉన్న వారే దేవుడితో సమానం. అందవికారంగా ఉన్న గణేష్ ను అయినవాళ్లు కాదనుకున్నారు. కానీ ఆ గణేషే హరిద్వార్ లోని ప్రజలకు దేవుడు రూపంలో ఉన్న వినాయకుడు కనిపిస్తున్నాడు, అందుకే ఆయనకు అన్నం పెట్టి , ఆశ్రయం ఇస్తున్నారు హరిద్వార్ ప్రజలు. గణేష్ 65 సంవత్సరాలు వయసు ఉన్నప్పటికి ఆయన ఏ రోజు నిరాశ చెందలేదంటే.. నిజంగా ఆయన వినాయకుడి రూపంలో దేవుడే అనిపిస్తుంది. దేవుడి లీలాలు అంటే ఇలాంగే ఉంటాయి. అంగవైకల్యంతో బాధపడేవారికి, వారిని హేళనగా మాట్లాడే వారు గణేష్ చూసి నేర్చుకోవాలని హరిద్వార్ ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more