తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తూ పార్టీ బలోపేతం చేస్తున్నారు. 63ఏళ్ల వయసులో కూడా ఆయన ఒక యువకుడిలా పాదయాత్ర చేస్తున్నారు. వేదికులు కూలిపోతున్నా, పార్టీ నుండి నాయకులు వెళ్లిపోతున్నా సరే అదైర్య పడకుండా.. మెండిగా ముందుకు పోతున్న 63 సంవత్సరాల నవయువకుడు. తమ పార్టీ మీద విమర్శలు చేసేవారికి కూడా థీటుగా సమాధానం చెబుతున్న చంద్రబాబు. ఒక పక్క తండ్రి పాదయాత్రతో పార్టీని బలోపేతం చేస్తూంటే.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మాత్రం సామాజిక సంబంధాలు కలిగిన వెబ్ సైట్ ద్వారా యువతను ఆకట్టునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు చేయలనే పనిని యువ నాయకుడు నారా లోకేష్ చేసి చూపించాడు. అందరు మీడియాను ,లేదా పేపర్ ద్వారా తమ సందేశాలు, విమర్శలు చేస్తుంటారు. కానీ లోకేష్ మాత్రం ట్విట్టర్ ద్వారా రాజకీయ ప్రత్యర్థుల పై విమర్శలు దాడి చేస్తున్నారు. లోకేష్ ట్విట్టర్ లో చేసే విమర్శలతో రాజకీయ నాయకులు సైతం ఖంగుతింటున్నారు. ఇప్పుడు అందరు ట్విట్టర్ భాయ్ గా పిలుచుకుంటున్నారు. తండ్రి బాటలోనే సాగుతున్న లోకేష్ బాబు పార్టీలో ఉన్న నాయకుల పై కూడా విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ఎక్కువగా యువతపై ద్రుష్టి పెట్టిన లోకేష్. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.
కొంత మంది పార్టీని వెళ్లిపోతూ.. పార్టీ అధినేత పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో పార్టీ నుంచి జంప్ జిలానీలు జోరుగా వెళ్లిపోతున్నారు. పార్టీ వదిలి వెళ్లిపోతున్నా వారిపై లోకేష్ ఘాటైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. గతంలో చాలా అంశాలకు ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చిన లోకేష్ బాబు.. తమ సొంత పార్టీ ని వదిలి వెళ్లిపోతున్న జంప్ జిలానీలకు ఝలక్ ఇవ్వటం జరిగింది. టీడీపీ ద్వారా రాజకీయం జీవితం ప్రారంభించి ఎదిగిన కొందరు నేతుల, తమ స్వార్థం కోసం ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారని ట్విట్టర్ లో విమర్శలు చేశారు. ఇలాంటి జంప్ జిలానీలను ఏమనాలని మండిపడ్డారు. వీళ్లని మోసగాళ్లా.. దగా కోర్లా.. నిజాయితీ లేనివాల్లా .. లేక 420 లా అంటూ లోకేష్ ఆవేశంతో ట్విట్టర్ ద్వారా ప్రశ్నించినట్లు సమాచారం. ఇలా 420లు వెళ్లిపోతున్నారు. టిడిపి నుండి వెళ్లిపోయే జంఫ్ జిలానీలు అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లటం పై లోకేష్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి 420లు ఎంతమంది వెళ్లిన పార్టీకి ఎలాంటి నష్టం లేదని లోకేష్ అన్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ విమర్శలకు పార్టీ నుండి వెళ్లిన జంప్ జిలానీలు ఎలా స్పందిస్తారో చూడాలి మరీ...
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more