ఉన్నట్టుండి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు భారత అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను జారీ చెయ్యటం రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నాయకులలో మిశ్రమ భావాలు కనిపిస్తున్నాయి.
2014 లో రానున్న సాధారణ ఎన్నికల మీద రెండు సంవత్సరాల నుంచీ అన్ని పార్టీలు ఆశలు పెట్టుకుని ఉన్నాయి, అదే లక్ష్యంగా పాటుపడుతున్నాయి. పందెంలో గెలుపు గుర్రం మీదనే కన్ను ఉన్నట్టుగా పార్టీల బలాబలాలను అంచనా వేస్తూ ఛోటా నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీకి మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిని నమ్మాలో, ఎవరు కడదాకా వెంట వస్తారో తెలియని పరిస్థితిలో పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి.
ఒక విధంగా పంచాయతీ ఎన్నికల వలన తమ సేనల బలాబలాలు, పార్టీలోని నాయకుల నిజాయితీలు తెలిసిపోతాయి. కానీ పక్కలో బల్లెంలా ఇటు తెలంగాణాలో తెరాస, అటు సీమాంధ్రలో వైకాపాలు వేళ్ళూనుతూ కనిపిస్తున్నాయి. సరే, ప్రతిపక్షమైన తెదేపా ఎలాగూ పాదయాత్రలతో పుంజుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీ ప్రచారాలతో 2014 వరకూ జాగ్రత్తగా తమకు అనుకూలంగా మలుచుకుందామనుకుని వేసుకున్న ప్రణాళిక పూర్తి కాకుండానే మధ్యలో ఈ ఎన్నికలంటే మరి దీని ప్రభావం సాధారణ ఎన్నికల మీద కూడా పడితే అనే అనుమానం వస్తోంది.
పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ మాత్రం సుప్రీం కోర్టు ఉత్తర్వులు రాగానే దాన్ని స్వాగతించారు కానీ, పార్టీ శ్రేణుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం మీద పట్టు కాస్త అనుమానంగానే ఉంది. 22000 వేల వరకూ ఉన్న పంచాయతీ రాజ్ ఎన్నికలలో వ్యతిరేకంగా ఓటు పడితే ఎలా అనే భయం కూడా కొందరు నాయకులు వ్యక్తపరుస్తున్నారు. కొందరు సీనియర్ నాయకులు మాత్రం కంచె మీద ఉండి అటా ఇటా అన్నట్టుగా వ్యవహరిస్తున్న మద్దతుదార్ల అసలు రంగు బయటపడిపోతుందని భావిస్తున్నారు. సీనియర్ నేత జె.సి.దివాకర్ రెడ్డి దీన్ని అనుకూలంగా తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల వలన ప్రభుత్వ పథకాలను వివరించటానికి అవకాశం ఇంకా ఉంటుందని అంటున్నారు. కాకపోతే వర్గాలుగా కాకుండా పార్టీలో ఐకమత్యంగా పనచేస్తే ఫలితాలు బావుంటాయని సూచిస్తున్నారు.
పెద్ద పరీక్షలకు తయారవుతుంటే మధ్యలో ఉన్నట్టుండి మరో పరీక్ష పెట్టటమే కాకుండా, దీనిలో తెచ్చుకున్న మార్కులు పెద్ద పరీక్షలో కలుస్తాయంటే విద్యార్థి మనోభావాలు ఎలా ఉంటాయో అలాగే ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మరోలా చెప్పాలంటే, తలపక్కనే తేనెపట్టు. తేనె దొరికిందని సంతోషపడాలా లేకపోతే తేనెటీగ కుట్టేస్తుందేమోనని భయపడాలా?
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more