Telangana decision kiran kumar reddy to rahul gandhi

congress vice president rahul gandhi, chief minister kiran kumar reddy,pcc president botsa, telangana, kiran kumar reddy, andhra pradesh, congress, sonia gandhi, rahul gandhi

telangana decision: kiran kumar reddy to rahul gandhi.andhra pradesh chief minister n. kiran kumar reddy said he had urged the centre and the congress leadership to take an early decision on telangana and assured them the state government will abide by it. he was interacting with the media after attending the two-day conclave convened by the new aicc vice-president rahul gandhi in new delhi on saturday.

telangana-decision.gif

Posted: 02/17/2013 11:56 AM IST
Telangana decision kiran kumar reddy to rahul gandhi

telangana decision: kiran kumar reddy to rahul gandhi

మన రాష్ట్ర మఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  మొట్ట మొదటి సారిగా  రాహుల్  గాంధీ తో  తెలంగాణ  విషయం మాట్లాడినట్లు తెలుస్తోంది.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు  పీసీసీ బొత్స సత్యనారాయణ కూడా  తెలంగాణ గురించి  రాహుల్ గాంధీకి వివరించి చెప్పినట్లు   సమాచారం. అయితే  తెలంగాణపై తుది నిర్ణయం వెలువడేందుకు మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణను త్వరగా తేల్చేయాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు మహారాష్ట్ర సిఎం ఫృధ్వీరాజ్ చౌహాన్, పశ్చిమ బెంగాల్ పిసిసి నేత అభ్యంతరాలు వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. ప్రత్యేక తెలంగాణను ప్రకటిస్తే విదర్భ ఏర్పాటునూ చేపట్టాల్సి ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్, గూర్కాలాండ్ డిమాండ్‌ను తప్పించుకోవటం కష్టమని పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు తేల్చిచెప్పారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అప్పటి ముఖ్యమంత్రి మాయావతి చేసిన ప్రతిపాదనకు ప్రజా వ్యతిరేకత ఎదురయ్యే ఆమె ఘోర పరాజయం పాలయ్యారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వీరు కరాఖంఢిగా తెలియ చేసినట్టు తెలిసింది. తెలంగాణను ప్రకటించిన మరు క్షణంలో దేశం మొత్తంమీద చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నందున ఈ అంశంపై ఆచితూచి వ్యవహరించాలని నేతలు రాహుల్‌కు తెలియచేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

telangana decision: kiran kumar reddy to rahul gandhi

రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణను ప్రకటించిన పక్షంలో తెలంగాణలో ఆశించిన ఫలితాలు దక్కుతాయా? తెలంగాణలో ఘన విజయం సాధించి తీరుతామని టి.కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు ఎంతవరకూ నిజం? అన్న విషయాలపై హైకమాండ్ ముఖ్యంగా రాహుల్‌గాంధీ సొంత వేగులతో కచ్చితమైన వివరాలు తెప్పించుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాతే తెలంగాణపై తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. ప్రత్యేక తెలంగాణకు తప్పించి ఇతర ప్రత్యామ్నాయాలకు అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మాత్రమే తాము రాహుల్‌కు సూచించామని, ఈ విషయంపై ఆయన మనోభావాలు గురించి తెలియదని ముఖ్యమంత్రి కిరణ్ స్పష్టం చేశారు. హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని తెల్చటంతోపాటు, రాష్ట్రానికి విడుదల చేయాల్సిన గ్యాస్‌ను కేజి బేసిన్ నుంచి విడుదల చేయించాల్సిందిగా రాహుల్‌ను కోరినట్టు ముఖ్యమంత్రి కిరణ్ చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagaland leader flies with rs1 crore cash in copter
Police department sexual harassment in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more